ఏపీకి చెందిన ఓ వ్యాపారవేత్త బెంగళూరులోని ఓ విలాసవంతమైన రిసార్ట్‌లో ఉంటూ కొన్ని రోజుల తరువాత బిల్లు చెల్లించకుండానే ఎగ్గొట్టి పారిపోయాడు. మొత్తం రూ.3.20 లక్షల బిల్లును అతను చెల్లించకుండానే వెళ్లిపోయాడని రిసార్ట్ వర్గాలు తెలిపాయి. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
ఏపీలోని పుట్టపర్తికి చెందిన కే రాజేష్ అనే వ్యక్తి బెంగళూరు రూరల్ జిల్లాలో ఉన్న దేవనహల్లిలోని ఓ విలాసవంతమైన రిసార్ట్‌కు తరచూ వస్తుంటాడు. అతను రెగ్యులర్ కస్టమర్. రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరిట నెలల తరబడి రిసార్టులోనే ఉంటుంటాడు. ఈ క్రమంలోనే అతను గత జూలై 23న రిసార్టుకు వచ్చాడు. అప్పటి నుంచి అక్కడే ఓ సింగిల్ రూమ్ తీసుకుని ఉంటున్నాడు.
ఒక్క రోజు రూమ్ చార్జిలు రూ.7,850 కాగా అతను మొన్నీ మధ్యే నవంబర్ 2వ వారం వరకు ఉన్నాడు. అయితే సెప్టెంబర్ వరకు బిల్లులను సరిగ్గానే చెల్లించాడు. రూ.8 లక్షలను చెల్లించాడు. అనంతరం తాను ఇంకొన్ని రోజుల పాటు ఉంటానని చెప్పడంతో నమ్మకమైన రెగ్యులర్ కస్టమరే కదా అని చెప్పి రిసార్ట్ వారు కూడా అతన్ని అడ్వాన్స్ అడగకుండానే రూమ్ రెంట్ గడువును పొడిగించారు. ఈ క్రమంలో ఇటీవలే అతను ఓ రోజు రిసార్ట్ నుంచి వెళ్లిపోయి ఇంక తిరిగి రాలేదు.
అతను కొన్నిసార్లు లాంగ్ డ్రైవ్ వెళ్లి వస్తుంటాడు. కనుక 1, 2 రోజుల పాటు వారు అతని గురించి పట్టించుకోరు. కానీ ఈసారి వెళ్లి మళ్లీ రిసార్ట్‌కు రాలేదు. చూస్తే ఖాళీ చేసినట్లు అర్థమైంది. దీంతో అతను రూ.3.20 లక్షల బిల్లు చెల్లించకుండానే పారిపోయాడని రిసార్ట్ వారు గ్రహించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…