Bigg Boss 5 : ప్రియాంకతో రిలేష‌న్‌షిప్‌పై నోరు విప్పిన మాన‌స్.. ఇవే త‌గ్గించుకుంటే మంచిద‌న్న సిరి..

Bigg Boss 5 : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న బిగ్ బాస్ కార్య‌క్ర‌మంలో సండే ఫ‌న్‌డేగా సాగింది. హౌజ్‌మేట్స్‌తో ప‌లు గేమ్స్ ఆడించిన నాగార్జున‌.. ప్రియాంకతో నీ ఫ్యూచర్‌ రిలేషన్‌ ఏంటన్న ప్రశ్నకు.. మానస్.. ఫ్రెండ్ అని చెప్పి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ప్రియాంక‌ను ఇదే ప్ర‌శ్న అడ‌గ‌గా, ఆమె కూడా అలాగే బ‌దులు ఇచ్చింది. శ్రీరామ్‌ను ఇన్‌ఫ్లూయెన్స్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నావా ? అన్న ప్రశ్నకు రవి లేదని చెప్పాడు.

ఈ వారం ‘అనుభవించు రాజా’ హీరోహీరోయిన్లు రాజ్‌ తరుణ్‌, కౌశిష్‌, నటుడు నెల్లూరు సుదర్శన్‌ బిగ్‌బాస్‌ స్టేజీపై సందడి చేశారు. కాసేపు హౌస్‌మేట్స్‌తో చిట్‌చాట్‌ చేసి అందరినీ సరదాగా నవ్వించారు. తర్వాత ఒక్కో డైలాగ్‌ను ఒక్కొక్కరికీ అంకితమివ్వాలంటూ ఓ సరదా గేమ్‌ ఆడించాడు నాగ్‌. ‘నన్ను రెచ్చగొట్టకు’ అన్న డైలాగ్‌ను మానస్‌.. సన్నీకిచ్చాడు.

‘నమ్మకం లేదు దొర’ డైలాగ్‌ను షణ్ను.. రవికిచ్చాడు. ‘సరె సర్లే చాలా చూశాం’ అన్న బోర్డును షణ్నుకిచ్చాడు రవి. ‘మస్తు షేడ్స్‌ ఉన్నయ్‌రా నీలో.. కమల్‌ హాసన్‌’ అన్న డైలాగ్‌ బోర్డును యానీ రవికి అంకితమిచ్చింది. ‘ఓన్లీ వన్స్‌ ఫసక్‌’ బోర్డును ప్రియాంక.. మానస్‌కు ఇచ్చింది. ‘ఏమో సర్‌, నాకు కనబడదు’ డైలాగ్‌ షణ్నుకు సరిగ్గా సెట్టవుతుందన్నాడు శ్రీరామ్‌.

‘ఇవే తగ్గించుకుంటే మంచిది’ అనేది షణ్నుకు, తనకు ఇద్దరికీ సెట్టవుతుందని చెప్పింది సిరి. ‘నీ బొందరా నీ బొంద’ డైలాగ్‌ను శ్రీరామ్‌కు అకింతమిచ్చింది కాజల్‌. ‘అయిపాయే’ అనేది రవికి సెట్టవుతుందన్నాడు సన్నీ. అనంతరం సిరి, ప్రియాంక సేఫ్‌ అవగా యానీ ఎలిమినేట్‌ అయింది. అనీ ఎలిమినేట్ కావ‌డంతో శ్రీరామ్ చంద్ర కాస్త విచారం వ్య‌క్తం చేశాడు.

మంచి తమ్ముడిగా ఉన్నందుకు రవికి థ్యాంక్స్‌ చెప్పింది. శ్రీరామ్‌ మంచి ఫ్రెండ్‌ అంది. ప్రియాంక.. సీతాకోక చిలుక అని కాంప్లిమెంట్‌ ఇచ్చింది. బయటకొచ్చాక మానస్‌తో మంచి ఫ్రెండ్‌ అవుతానంది. సన్నీ తన ఫ్రెండ్‌ అని, అతడిని మిస్‌ అవుతానంది. కాజల్‌ గురించి చెప్పడానికి ఏమీ లేదని పెదవి విరించింది. అనంతరం అందరి దగ్గరా వీడ్కోలు తీసుకుంది.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM