Bigg Boss 5 : హౌజ్‌లో తెగ సంద‌డి చేసిన మాన‌స్ త‌ల్లి.. సిరి మ‌దర్ మాట‌ల‌కు హ‌ర్ట్ అయిన ష‌ణ్ముఖ్‌..

Bigg Boss 5 : బిగ్ బాస్ హౌజ్ ఇప్పుడు ఎమోష‌న్ మూడ్‌లో ఉంది. హౌజ్‌మేట్స్ ఫ్యామిలీని ఇంట్లోకి పంపిస్తున్న క్ర‌మంలో సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొని ఉంది. గ‌త ఎపిసోడ్‌లో కాజ‌ల్ ఫ్యామిలీ సంద‌డి చేయ‌గా, గురువారం శ్రీరామ్‌ కోసం ఆమె సోదరి అశ్విని హౌస్‌లోకి వచ్చింది. అందరితో పలకరింపులు అయిపోయాక శ్రీరామ్‌కు గేమ్‌లో సలహాలు, సూచనలు ఇచ్చింది. క‌ప్పు కొట్టి రావ‌ల్సిందే అని బామ్మ చెప్పింద‌ని అశ్విని పేర్కొంది.

శ్రీరామ్ సోద‌రి వెళ్లిపోయాక మాన‌స్ త‌ల్లి ప‌ద్మిని ఇంట్లోకి అడుగుపెట్టింది. ఆమె చాలా హుషారుగా క‌నిపించారు. ఫుల్ ఎనర్జీతో హౌస్‌లో సందడి చేశారు. మానస్ కూల్ అండ్ కామ్‌గా ఉంటే.. అతనికి విరుద్ధంగా ఉంది పద్మిని. ప్రియాంక.. మానస్ గేమ్‌ని డిస్టర్బ్‌ చేస్తుందన్న విషయాన్ని ఇన్ డైరెక్ట్‌గా అతనికి అర్థమయ్యేట్టుగా చెప్పింది పద్మిని. ఇక ర‌వి, ష‌ణ్ముఖ్‌, కాజ‌ల్ మీద తెగ పంచ్‌లు వేసింది.

ఇక శ్రీరామ్.. ఆంటీ మీరు ఇక్కడే ఉండండి. అని అంటే.. ఆంటీ అంటావ్ ఏంటి ? అక్క అని అనండి.. అంటూ ఫుల్ స్వింగ్‌లో కనిపించారు మానస్ తల్లి. ఆ తరువాత శ్రీరామ్.. ఆంటీ మీరు ఏజ్ తగ్గించుకోవల్సిన అవసరం లేదు.. ఇప్పుడు కూడా హాట్‌గానే ఉన్నారని పంచ్ వేశాడు. మొత్తానికి హౌస్‌లో ఉన్నంతసేపూ పద్మిని అల్లాడించారు.

ఫుల్ ఎనర్జీతో అందర్నీ ఆటాడించారు. ఇక మానస్‌తో మాట్లాడుతూ గేమ్ చాలా బాగా ఆడుతున్నావని.. ప్రతి పేరెంట్స్ నిన్ను విన్నర్‌గా చూడాలని కోరుకుంటున్నారు.. వాళ్లని ఆశని నువ్ నిజం చేయాలంటే ఎవరు డిస్టర్బ్‌ చేసినా డిస్టర్బ్‌ కాకు.. అని స‌ల‌హాలు ఇచ్చింది.

ఇక సిరి తల్లి శ్రీదేవి హౌస్‌లోకి రాగా షణ్ముఖ్‌ను నువ్వు హగ్‌ చేసుకోవడం నచ్చలేదని ముక్కుసూటిగా చెప్పింది. తండ్రి లేని పిల్ల కదా.. షణ్ముఖ్‌ తండ్రిగా, అన్నగా అన్ని రకాలుగా సాయం చేస్తూ దగ్గరవుతుండటం నచ్చలేదంది. దగ్గరవడం మంచిదే కానీ హగ్గులు నచ్చట్లేదని చెప్పగా సిరి టాపిక్‌ డైవర్ట్‌ చేస్తూ ఆమెను పక్కకు తీసుకెళ్లింది. దీంతో ష‌ణ్ముఖ్ చాలా హ‌ర్ట్ అయ్యాడు. నా గేమ్‌ కూడా వదిలేసి ఇంత సపోర్ట్‌ చేస్తే ఆమె తల్లితో ఇలా మాట పడాల్సి వచ్చిందని ఫీలయ్యాడు.

మరోవైపు తనను ఎందుకు దూరం పెడుతున్నావని ప్రియాంక.. మానస్‌ను నిలదీసింది. నువ్వు నా దగ్గరనుంచి ఎక్కువగా ఆశిస్తున్నావని, నేను ఫ్రెండ్‌గా వచ్చి మాట్లాడితే నీకు ఇంతేనా అనిపిస్తుందంటూ.. ఆమెను ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దని.. నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM