Kodali Nani : అసెంబ్లీలో వైసీపీ నేతలు చంద్రబాబుతోపాటు ఆయన సతీమణిని దూషించారనే ఆరోపణలతో చంద్రబాబు మీడియా ఎదుట కన్నీరు పెట్టుకోగా.. ఈ విషయంపై చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే. నారా భువనేశ్వరిపై కొడాలి నాని, వల్లభనేని వంశీ విమర్శలు చేస్తే ఎన్టీయార్ స్పందించిన తీరు సరిగా లేదని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. భువనేశ్వరి మేనల్లుడిగా ఎన్టీయార్ విఫలమయ్యారని విమర్శించారు.
మేనత్తను నోటికొచ్చినట్లు అంటే మేనల్లుడిగా ఎన్టీఆర్ సరిగ్గా స్పందించలేదని రాష్ట్రం మొత్తం అనుకుంటోందని వర్ల రామయ్య చెప్పుకొచ్చారు. సినిమాల కోసం కుటుంబాన్ని.. నైతిక విలువలలను వదులుకుంటారా అంటూ వర్ల రామయ్య నిలదీశారు. వల్లభనేని వంశీ ఫొటోలు పెట్టినప్పుడే ఎన్టీఆర్ ఘాటుగా స్పందించి ఉంటే ఇంత జరిగేది కాదంటూ వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. బూతుల మంత్రి పేర్నినానికి ఎన్టీఆర్ అంటే చాలా భయమని చెబుతూ.. అలాంటి వారిని కంట్రోల్ చేసే శక్తి ఆయనకే ఉందని చెప్పారు.
వర్ల రామయ్య వ్యాఖ్యలపై స్పందించిన కొడాలి నాని.. జూనియర్ ఎన్టీఆర్ తమను ఎలా కంట్రోల్ చేస్తాడని అన్నారు. ఆయన చెబితే తామెందుకు వింటామన్నారు. నందమూరి కుటుంబమంటే సీఎం జగన్ కూ గౌరవమేనన్నారు. నందమూరి కుటుంబ సభ్యులు అమాయకులన్నారు. శవాల మీద చిల్లర ఏరుకునే నాయకుడు చంద్రబాబు అని మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. ఆయన భార్య పేరును వాడుకుంటే నందమూరి కుటుంబం మద్దతిస్తుందని.. చంద్రబాబు కుట్ర పన్నారని.. ఆరోపించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…