Bigg Boss 5 : నీకు హాని చేయాల‌నుకుంటే వారి నాశ‌నం కోరుకుంటావు.. పింకీపై మాన‌స్ ఫైర్..

Bigg Boss 5 : బిగ్ బాస్ సీజ‌న్ 5 కార్యక్ర‌మంలో ప్ర‌స్తుతం కెప్టెన్సీ కంటెండ‌ర్ టాస్క్ జ‌రుగుతోంది. హౌజ్ మేట్స్ సూప‌ర్ హీరోస్, సూప‌ర్ విల‌న్స్ అంటూ రెండు టీంలుగా విడిపోగా, ఒక‌రిపై ఒక‌రు ప్ర‌తాపం చూపించుకుంటున్నారు. బుధవారం నాడు శ్రీరామచంద్ర, యాంకర్ రవిలు టాస్కులు పూర్తి చేశారు. ఇక సూపర్ హీరోస్ టీం నుంచి ప్రియాంక వచ్చింది. ఆమెకు జ్యూస్‌లు తాగించి, పెయింట్స్ వేయించి, జుట్టు కూడా క‌త్తిరించుకోమ‌ని చెప్పారు. చివ‌రి క్ష‌ణంలో సిరి వ‌ద్ద‌ని చెప్పింది.

విల‌న్ టీం వాళ్లు ఇచ్చిన టాస్క్‌ల‌న్నీ పూర్తి చేసి త‌న టీంకి ఓ పాయింట్ తెచ్చిపెట్టింది ప్రియాంక‌. ఈ సారి హీరో టీం చాన్స్ రావడంతో వారు.. విలన్ టీం నుంచి ఆనీ మాస్టర్‌ను సెలెక్ట్ చేసుకున్నారు. రకరకాల డ్రింకులు ఇచ్చారు.. మిరపకాయ్ తినమని ఇచ్చారు.. పెయింట్ పూసుకోమ్మన్నారు. ఐస్ వాటర్ ఒంటి మీద పోసుకోమన్నారు. కాజల్ అయితే కాస్త పైశాచికం చూపించి పేడ కలిపింది. ఇలా ఎన్ని రకాలుగా చేసినా కూడా అనీ మాస్టర్ తట్టుకుంది. చివరి వరకు నిలబడి గెలిచింది.

ఇక సిరిపై ష‌ణ్ముఖ్ ప‌దే ప‌దే అరుస్తుండ‌డంతో జెస్సీ.. ఆమె త‌ర‌పున మాట్లాడాడు. అంద‌రి ముందు ఎందుకు అలా అరుస్తున్నావు అని అడిగాడు. దానికి సంచాలక్ కాబట్టి అలా అరిచాను అంటాడు, అది తప్పు అయితే నామినేట్ చేయండని అంటాడు. గుంజిళ్లు తీసింది మాత్రం చెప్పవా ?.. ప్రతీ అమ్మాయి దగ్గరకు వెళ్లి అలా చేస్తానా ? అంటూ సిరి, జెస్సీల మీద షన్ను ఫైర్ అవుతాడు. టాస్కుల్లో అయిన గాయాలకంటే.. నువ్ అనే మాటలే ఎక్కువగా బాధపెడుతున్నాయ్ అని సిరి ఏడ్చేసింది.

సిరి ఏడ‌వ‌డం గురించి మాన‌స్‌తో డిస్క‌ష‌న్ చేసింది ప్రియాంక‌. ఎవ‌డు పెట్టుకోమ‌న్నాడు, అంత గ్రీజు ఎందుకు అని సిరిపై సెటైర్లు వేసింది. దీంతో మాన‌స్‌.. పింకీ, నీకు నోటిదూల ఎక్కువ‌గా ఉంది, నిన్న నువ్వు ఏడ్చిన‌ప్పుడు కూడా అంద‌రూ అలాగే అనుకుంటారు. నువ్వు ఆలోచించే విధానం చాలా త‌ప్పు అని చెప్పుకొచ్చాడు. నీకు ఎవ‌రైనా హాని చేయాల‌నుకుంటే నాశ‌నం అయిపోవాలి అని కోరుకుంటావు, అది నీ ఆలోచ‌నా విధానం అని చెప్ప‌డంతో ప్రియాంక బాధ‌పడి అక్క‌డి నుండి లేచి వెళ్లిపోయింది.

ఇక సిరి గురించి కాజల్, షన్నులు మాట్లాడుకున్నారు. సిరి చాలా స్ట్రాంగ్.. టాస్కుల్లో బాగా ఆడుతుంది అని షన్ను అంటే.. సిరి రాడ్.. అని కాజల్ అంటుంది. బీభత్సమైన రాడ్ అంటూ సిరి గురించి కామెంట్ చేస్తాడు షన్ను. ఎప్పుడు క‌లిసే మేం ఆడ‌తాం. ఈ సారి మాత్రం కావాలనే వేర్వేరుగా ఉన్నాం.. మేం కలిసి ఆడటం లేదు అని నిరూపించుకునేందుకు ఇలా వేర్వేరు టీంలలోకి వచ్చామని అంటాడు. అయితే టాస్క్ వ‌ల‌న సిరి, ష‌ణ్ముఖ్ మ‌ధ్య దూరం బాగానే పెరుగుతోంది.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM