Bigg Boss 5 : బిగ్ బాస్ 5 సీజన్ ఎప్పటికప్పుడు ఆసక్తికరంగా సాగుతోంది. నిత్యం ఇంటి సభ్యులు హౌస్‌లో సందడి చేస్తున్నారు. ఇక శని, ఆది వారాలు వస్తే వినోదానికి అవధులు లేకుండా పోతున్నాయి. తాజాగా ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో ఆద్యంతం ఫన్నీగా సాగింది.
ఆదివారం ఎపిసోడ్‌లో హౌస్‌లో నాగార్జునకు ఇంటి సభ్యులు ట్రీట్ ఇచ్చారు. ఆయన నటించిన నిన్నే పెళ్లాడతా మూవీ 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. దీంతో ఇంటి సభ్యులు ఆ మూవీలోని పాటలకు డ్యాన్సులు చేస్తూ అలరించారు. ఇందుకు నాగార్జున సర్ ప్రైజ్ అయ్యారు. ఒక దశలో తన కళ్లల్లో నీళ్లు తిరిగాయని ఆయనే చెప్పారు.
ఇక ఇంటి సభ్యులకు నాగార్జున గెస్సింగ్ గేమ్ పెట్టారు. అందులో సినిమా పేర్లను గెస్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే శ్రీరామ్ టీమ్ ఇందులో సక్సెస్ అయింది. ఇక దాక్కో దాక్కో మేక అనే ఇంకో గేమ్ కూడా నిర్వహించారు. ఇందులోనూ అందరూ నవ్వులను పూయించారు.
ఇక ఎలిమినేషన్ ప్రక్రియలో శనివారం ఎపిసోడ్‌లో ప్రియ, కాజల్, రవి, సన్నీ సేవ్ అయ్యారు. ఆదివారం ఎపిసోడ్‌లో సిరి, అనీ మాస్టర్, లోబో, నటరాజ్ మాస్టర్ ఉన్నారు. వీరిలో మొట అనీ మాస్టర్, ఆ తర్వాత సిరి సేవ్ అయ్యారు. చివరగా లోబో, నటరాజ్ మధ్య ఎలిమినేషన్ ప్రక్రియ ఉత్కంఠగా సాగింది. దీంట్లో చివరకు లోబో సేవ్ అయ్యారు. నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. ఆయన వెళ్లిపోవడంతో ఇంటి సభ్యులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ విధంగా ఆదివారం ఎపిసోడ్ సాగింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…