Bigg Boss 5 : బిగ్ బాస్ సీజన్ 5 మరి కొద్ది రోజులలో ముగియనుంది. 19 మంది కంటెస్టెంట్స్‌తో సీజన్ 5 మొదలు కాగా, ప్రస్తుతం హౌజ్‌లో 8 మంది మాత్రమే మిగిలారు. ఇక సోమవారం నామినేషన్స్‌ని షురూ చేశారు బిగ్ బాస్. ఈ నామినేషన్స్‌లో పాల్గొని ఎవర్నైతే నామినేట్ చేయాలని అనుకుంటున్నారో వారి దిష్టిబొమ్మ కుండ పగలగొట్టి ఒక్కొక్కరూ ఇద్దరిద్దర్ని నామినేట్ చేయాలని చెప్పారు బిగ్ బాస్.
నామినేషన్ ప్రక్రియ రవితో మొదలు కాగా, ముందుగా సన్నీని నామినేట్ చేస్తూ.. ఇంట్లో పని సరిగా చేయడం లేదని వారం మొత్తం తప్పించుకుని తిరుగుతున్నట్టుగా అనిపించింది అని చెప్పాడు రవి. దీంతో సన్నీ- రవిల మధ్య డిస్కషన్ నడిచింది. నువ్ చేయమని చెప్తే చేస్తావ్.. నేను చెప్పకుండానే చేస్తా.. అదీ నీకు నాకు ఉన్న తేడా, నేను 4 డేస్ నుంచి వాష్ రూం క్లీన్ చేయలేదని నామినేట్ చేస్తున్నావ్ కదా.. నీకు తెలియదేమో ట్రక్ టాస్క్ ముగిసిన తరువాత వాష్ రూం నేనే క్లీన్ చేశా.. అని చెప్పాడు సన్నీ.
ఇక రెండో నామినేషన్‌లో భాగంగా కాజల్‌ని నామినేట్ చేశాడు రవి. షణ్ముఖ్-సిరిల రిలేషన్‌పై నోరు జారిన రవి.. ఆ ఇష్యూని కాజల్ బహిర్గతం చేయడంతో అదే ఇష్యూని నామినేషన్‌లో ప్రస్తావించాడు. ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్‌ని చెడగొట్టడొద్దని రవి చెప్పడంతో.. అలా అనుకున్నప్పుడు వాళ్ల గురించి చెడుగా మాట్లాడటం ముందు నువ్ మానేయాలి అని కౌంటర్ ఇచ్చింది కాజల్.
ప్రియాంక షణ్ముఖ్‌ని నామినేట్ చేస్తూ గోల్డ్ టాస్క్‌లో షణ్ముఖ్ పార్టిసిపేట్ చేసినట్టుగా అనిపించలేదు, అందుకే షణ్ముఖ్‌ని నామినేట్ చేస్తున్నట్టు చెప్పింది. రెండో నామినేషన్స్‌లో భాగంగా సిరిని నామినేట్ చేసింది. ఇక కాజల్.. రవి బండారాన్ని బయటపెట్టడంతో షణ్ముఖ్.. రవిని నామినేట్ చేసి దిమ్మతిరిగే పంచ్ ఇచ్చాడు. కెప్టెన్‌గా రవి, సంచాలకుడిగా కాన్ఫిడెంట్‌గా లేవు అందుకే నామినేట్ చేస్తున్నా అని చెప్పాడు.
రెండో నామినేషన్ లో భాగంగా కాజల్‌ని నామినేట్ చేశాడు షణ్ముఖ్. అయితే ప్రియాంక తనని నామినేట్ చేసినప్పటికీ ఆమెను వదిలేసి మరీ కాజల్‌ని నామినేట్ చేశాడు షణ్ముఖ్. సిరి నేను బయట గేమ్ సెట్ చేసుకుని వచ్చాం అని నాగ్ సార్ ముందు క్వశ్చన్ రెయిజ్ చేయడం తనకి నచ్చలేదని చెప్పాడు షణ్ముఖ్.
ఇక తన ఫస్ట్ నామినేషన్‌ని సన్నీపై ఉపయోగించాడు శ్రీరామ్.. కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌లో సన్నీ వల్ల నేను వెళ్లకపోయానని అందుకే సన్నీని నామినేట్ చేస్తున్నట్టు చెప్పాడు శ్రీరామ్. అయితే ఇద్దరి మధ్య జరిగిన డిస్కషన్‌లో శ్రీరామ్ యాటిట్యూడ్ చూపించాడు. ఆవేశంలో శ్రీరామ్ సన్నీని నామినేట్ చేసి కుండబద్దలు కొట్టేశాడు. ఇక రెండో నామినేషన్ లో భాగంగా కాజల్‌ని నామినేట్ చేశాడు.
సన్నీ.. ఫస్ట్ నామినేషన్ లో భాగంగా మొదటగా రవిని నామినేట్ చేశాడు. నువ్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు వరుసగా పనులు చెప్పావ్.. కెప్టెన్ అంటే పని చేయించడమే కాదు.. చేయడం కూడా అని చురకలేశాడు. నువ్ నాతో దిల్ దార్ ఉన్నావా ? ఒక్కరితో అనిపియ్ ఆ మాట.. సంచాలకుడిగా నువ్ కరెక్ట్ ఉన్నావా ? ఈ హౌస్‌లో ఉన్న వాళ్లలో నువ్వే మోస్ట్ ఫేక్ పర్సన్‌వి. నీకు కామన్ సెన్స్ ఉండదు.. మళ్లీ నువ్ నాకు చెప్తున్నావ్.. అని సన్నీ క్లాస్ పీకాడు.
శ్రీరామ్ తన పేరు చెప్తూ ఏంటి కొడతావా ? కొట్టు అంటూ సన్నీ మీదికి దూసుకుని వచ్చి రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఇంటి పేరుతో సహా పేరు చెప్పి ఆ పేరుతో పిలవాలని చెప్పడం కాస్త ఓవర్‌గానే అనిపించింది. ఇక సిరి.. రవి, ప్రియాంకలను నామినేట్ చేసింది. ఇక రవిని నామినేట్ చేస్తూ కాజల్ కుండబద్దలు కొట్టేసింది.. రవి, నీకు ధైర్యం లేదా ? లేక జ్ఞాపక శక్తి లేదా ? అని అడిగింది. రెండూ ఉన్నాయి.. అని చెప్పాడు రవి.
ఇక శ్రీరామ్‌ని నామినేట్ చేస్తూ.. గేమ్ అయిపోయిన అనీ మాస్టర్ ఉసురు పోసుకున్నా అని అనడం ఏంటి ? గేమ్‌లో ఉసురు ఏంటి ? ఆ మాట నాకు నచ్చలేదు అందుకే నామినేట్ చేస్తున్నా అని చెప్పింది కాజల్. మొత్తంగా 12వ వారం నామినేషన్స్‌లో రవి, సన్నీ, శ్రీరామ్, కాజల్, సిరి, ప్రియాంక, షణ్ముఖ్ ఈ ఏడుగురు నామినేట్ అయ్యారు. మానస్ కెప్టెన్ కావడం వల్ల ఈ వారం నామినేషన్స్ నుంచి మినహాయింపు లభించింది.