Bigg Boss 5 : బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో సీజన్ 5 సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ బిగ్ బాస్ లో కొట్టుకోవడానికి, తిట్టుకోవడానికి, అలాగే టాస్క్ లు.. ఒకరి మీద ఒకరు రూమర్స్, గాసిప్స్ క్రియేట్ చేసుకోవడానికి బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. అలాగే బిగ్ బాస్ హౌస్ లో రొమాన్స్ కి కూడా ఎక్కువ స్కోప్ ఉన్న రియాలిటీ ప్రోగ్రామ్. ఈ సీజన్ లో కూడా క్యూట్ హాట్ బ్యూటీ హమీదా, శ్రీరామ్ ల రొమాన్స్ ప్రేక్షకులకు ఎంటర్ టైనింగ్ గా నిలిచింది. కానీ ఆమె ఎలిమినేషన్ తో బిగ్ బాస్ హౌస్ లో రొమాన్స్ సెక్షన్ లేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ఇక శ్రీరామ్ కూడా హమీదా వెళ్ళిపోవడంతో చాలా డల్ అయ్యాడనే చెప్పాలి. ఇంతకుముందు టాస్కుల్లో గానీ, గొడవలు జరిగేటప్పుడు గానీ చాలా యాక్టివ్ గా ఉండే ఈ సింగర్ ప్రస్తుతం ఎప్పుడు చూసినా హౌస్ లో ఏదో ఉన్నాం.. అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నాడు. అయితే ఇదంతా హమీదా వెళ్ళిపోవడం వల్లే అని నెటిజన్స్ అంటున్నారు. అందుకే ఆమె మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోకి రావాలని అనుకుంటున్నారు. అప్పుడే బిగ్ బాస్ గేమ్ కాస్త స్పైసీగా మారుతుందని అనుకుంటున్నారు.
అలాగే రవి, ప్రియల గొడవలో లహరి బాధితురాలిగా నిలిచి మరీ ఎలిమినేట్ అయ్యింది. అలాగే హౌస్ లో గొడవలు పెరగడానికి అయిన లహరిని తిరిగి తీసుకురావాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో బిగ్ బాస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తెలియాలి. అయితే ఒక్కసారి ఎలిమినేట్ అయిన వాళ్ళని తిరిగి పంపే ఉద్దేశం బిగ్ బాస్ కి ఉండదని.. అందుకే కొత్తవాళ్ళని వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఏమైనా లోపలికి పంపిస్తారేమో.. అంటూ మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు.