Bigg Boss 5 : బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో అత్యధిక టీఆర్‌పీ రేటింగ్ సొంతం చేసుకొని దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే వారం వారం నాగార్జున స్టేజ్ పై సందడి చేస్తూ కంటెస్టెంట్ లను, ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతి వారం బిగ్ బాస్ వేదికపై పలువురు సెలబ్రిటీలు సందడి చేస్తూ ఈ కార్యక్రమానికి మరింత టీఆర్పీ రేటింగ్స్ రావడం కోసం కృషి చేస్తున్నారు. ఇదిలా ఉండగా గత వారం నవరాత్రుల స్పెషల్ ఎపిసోడ్ లో భాగంగా బిగ్ బాస్ వేదికపైకి హైపర్ ఆది గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి తనదైన శైలిలో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేశారు.
ఇలా బిగ్ బాస్ వేదికపైకి ఎంట్రీ ఇచ్చిన హైపర్ ఆది నాగార్జునతో మొదలుకొని హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ ల పై తనదైన శైలిలో పంచ్ డైలాగులు వేసి అందరినీ నవ్వించాడు. అయితే అరగంట పాటు వేదికపై సందడి చేసిన హైపర్ ఆదికి బిగ్ బాస్ ఎంతో రెమ్యునరేషన్ చెల్లించి ఉంటారనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఈ క్రమంలోనే బిగ్ బాస్ వేదికపైకి హైపర్ ఆదిని ఆహ్వానించడానికి ఈ షో ప్రారంభం కాకముందే నిర్వాహకులు హైపర్ ఆదితో కమిట్‌మెంట్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని రెగ్యులర్ గా ఫాలో కమ్మని చెప్పారట. ఇందుకుగాను హైపర్ ఆదికి ముందుగానే నిర్వాహకులు కొంత మొత్తంలో అడ్వాన్స్ చెల్లించారని బిగ్ బాస్ షో లో అరగంటపాటు అందరిని సందడి చేసిన హైపర్ ఆదికి నిర్వాహకులు రూ.2.50 లక్షల వరకు రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు సమాచారం.