Bigg Boss 5 : ప్రస్తుతం కొనసాగుతున్న బిగ్ బాస్ 5 తెలుగు సీజన్‌లో యాంకర్ రవి టైటిల్ ఫేవరెట్‌గా ఉన్న విషయం విదితమే. సీజన్ మొదటి వారం నుంచే రవి అందరి దృష్టిలో పడ్డాడు. అతని వ్యూహాలు, ఎత్తులతో అందరూ అతన్ని టైటిల్ ఫేవరెట్‌గా చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే రవిపై ఫోకస్ కూడా పెరిగిందని చెప్పవచ్చు.
రవిని మానిపులేటర్ అని, ఇన్‌ఫ్లుయెన్సర్ అని అంటుంటారు. కానీ అతను నిజానికి చాలా కష్టపడతాడు. 9 వారాల్లో అతను 8 వారాలుగా నామినేషన్స్‌లో ఉంటున్నాడు. ఇక ఈ వారం కూడా ఎలిమినేషన్ జోన్‌లో ఉన్నాడు. అయితే ఈ వారం సేవ్ అయితే అతనికి వచ్చే వారం ఇమ్యూనిటీ లభిస్తుంది. ఎందుకంటే.. రవి హౌస్‌కి కొత్త కెప్టెన్ అయ్యాడు. ఈ క్రమంలోనే అతను హౌస్ కి కెప్టెన్ అయిన 9వ సభ్యుడిగా నిలిచాడు.
ఇప్పటి వరకు అనీ మాస్టర్, షణ్ముఖ్, సిరి, శ్రీరామచంద్ర, సన్నీ, జశ్వంత్, విశ్వ (రెండు సార్లు), ప్రియలు కెప్టెన్‌లుగా ఉన్నారు. రవి కెప్టెన్ అవడం మొదటి సారి. అయితే హౌస్‌లో సభ్యుల సంఖ్య తగ్గుతుండడంతో కంటెస్టెంట్ల మధ్య పోటీ బాగా పెరిగిపోయింది. అందువల్ల ఇది క్లిష్టమైన సమయం అని చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితిలో రవి కెప్టెన్ కావడం అతనికి చాలా అనుకూలించే అంశం అని చెప్పవచ్చు.
ఈ వారం బిగ్‌బాస్ హోటల్‌టాస్క్ నిర్వహించారు. అందులో రవికి సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌లో విజేతలతోపాటు రవి ఎలా కెప్టెన్‌గా ఎన్నికయ్యాడో ఈ రోజు (శుక్రవారం) ఎపిసోడ్‌లో చూపిస్తారు. ఈ క్రమంలోనే ప్రోమోలో మానస్, ప్రియాంకలు కెప్టెన్సీ టాస్క్‌లో డిస్‌క్వాలిఫై అవడం చూపించారు. అయితే మొత్తానికి చూస్తే ఈ రోజు రాత్రి ఎపిసోడ్ ఆసక్తికరంగా ఉంటుందని తెలుస్తోంది.