Bigg Boss 5 : బిగ్ బాస్ 5వ సీజన్ వారం వారం ఎంతో ఆసక్తిగా కొనసాగుతోంది. వారం మొత్తం కొంత పస తగ్గుతున్నా.. వారాంతాల్లో నాగార్జున రావడం.. ఎలిమినేషన్ ప్రక్రియ జరగడం.. వల్ల ఈ షోను ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఈ వారం కూడా మహిళా కంటెస్టెంట్‌నే ఎలిమినేట్ చేశారు. ప్రియా బిగ్ బాస్ హౌజ్ నుంచి ఎలిమినేట్ అయింది.
ఈ వారం ప్రియా ఎలిమినేట్ అవుతుందని ముందే ఊహించారు. ఈ విషయం తెగ ప్రచారం కూడా అయింది. అయితే అందరూ ఊహించినట్లుగానే ప్రియాను ఎలిమినేట్ చేశారు. అనీ మాస్టర్, ప్రియా గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన రెండు బాక్సుల్లోకి వెళ్లారు. తరువాత అందులోంచి అనీ మాస్టర్ ఇంటిలోకి వెనక్కి వచ్చారు. కానీ ప్రియా స్టేజీ మీదకు వచ్చింది. బాక్సులను రెండు తెరిచి చూస్తే ఎవరూ ఉండరు. దీంతో ప్రోమోలో అందరూ డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని భావించారు. కానీ అలా జరగలేదు. ఈ వారం ప్రియా ఎలిమినేట్ అయింది.
అయితే గత సీజన్‌లో కన్నా ఈ సీజన్‌లో ఎక్కువ మంది కంటెస్టెంట్లు పాల్గొంటున్నారు. దీంతో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని కచ్చితంగా అంచనా వేశారు. అయితే దాన్ని ఈ వారం అమలు చేయలేదు. మరి వచ్చే వారాల్లో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందో, ఉండదో.. చూడాలి.