Bhola Shankar : మెగాస్టార్ చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత వరుస సినిమా అవకాశాలను అందుకుని ప్రస్తుత హీరోలకు పోటీగా సినిమాలలో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆచార్య చిత్రాన్ని పూర్తి చేసుకోగా.. ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కాకుండా మెగాస్టార్ చిరంజీవి బాబీ దర్శకత్వంలో ఒక సినిమా, మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళాశంకర్ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు.
ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ దశలో ఉండగా మెగాస్టార్ చేతికి చిన్న సర్జరీ కావడంతో ఈ షూటింగ్ వాయిదా పడింది. ఇక భోళాశంకర్ సినిమా ఫైనల్ డ్రాఫ్ట్ పట్ల చిరంజీవి అసంతృప్తిగా ఉండడం చేత కొన్ని రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతుందని.. ముందుగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పట్టాలెక్కనుందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు అన్నింటినీ తిప్పికొడుతూ భోళాశంకర్ చిత్రబృందం మెగా అభిమానులకు శుభవార్తను తెలియజేసింది.
ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్ ఓపెనింగ్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు. నవంబర్ 11వ తేదీన 7:45 నిమిషాలకు ఈ చిత్రం ఓపెనింగ్ కాగా నవంబర్ 15 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లను ప్రారంభించనున్నారు. ఈ మూవీలో కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలి పాత్రలో నటిస్తుండడం విశేషం.