Bhimla Nayak : మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోషియమ్‌కు తెలుగు రీమేక్‌గా రూపొందుతున్న చిత్రం భీమ్లా నాయక్. పవన్‌కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న ఈ చిత్రంలో భీమ్లా నాయక్‌గా పవన్ కళ్యాణ్ కనిపిస్తుంటే, డానియల్ శేఖర్‌గా రానా దగ్గుబాటి నటిస్తున్నారు. పోలీస్ ఆఫీసర్, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్‌కు మధ్య జరిగే ఈగో క్లాషెష్ ఈ సినిమా అని అంటున్నారు. తెలుగు నేటివిటీ, పవన్ కళ్యాణ్ ఇమేజ్‌ను బేస్ చేసుకుని త్రివిక్రమ్ కథలో మార్పులు, చేర్పులు చేశారట.
భీమ్లా నాయక్ సినిమాపై అంచనాలు భారీగా ఉండగా, ఇప్పటికే విడుదలైన పాటలు భారీ స్థాయిలో బజ్ క్రియేట్ చేశాయి. సంగీత దర్శకుడు తమన్ ఎప్పటిలాగే మరోసారి తన సత్తా ఏంటో చూపించాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటికి సంబంధించిన పాత్రల ఫస్ట్ లుక్ టీజర్స్ అదిరిపోయాయి. అభిమానులు.. ట్రైలర్, టీజర్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, వాటికి సంబంధించిన సమాచారం ఒకటి బయటకు వచ్చింది.
భీమ్లా నాయక్ సినిమాకు సంబంధించిన టీజర్ ను రానా దగ్గుబాటి పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 14న విడుదల చేయనున్నారట. ఒక పవర్ఫుల్ హై వోల్టేజ్ టీజర్ ను విడుదల చేయాలని ఇప్పటికే చిత్ర యూనిట్ ఒక ప్లాన్ వేసుకున్నట్లు సమాచారం. దాదాపు టీజర్ ఫైనల్ కట్ కూడా రెడీ అయినట్లు తెలుస్తోంది ఇక ట్రైలర్‌ని జనవరి మొదటి వారంలో 1 లేదా 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…