Bhimla Nayak : వకీల్ సాబ్ తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం భీమ్లా నాయక్. మలయాళం హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియం’కు తెలుగు రీమేక్ ఇది. ఈసినిమాని తెలుగు నేటివిటీకి అనుగుణంగా తెరకెక్కించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పుట్టిన రోజు సందర్బంగా లాలా భీమ్లా అనే పాటను విడుదల చేయడం జరిగింది. ఈ పాటకు త్రివిక్రమ్ సాహిత్యాన్ని అందించారు.
లాలా భీమ్లా అనే పాటను అరుణ్ కౌండిన్య పాడగా.. ఈ పాటకు అభిమానులకు పూనకాలు వస్తున్నాయి. థమన్ ఏ రేంజ్ లో పవన్ సినిమా భీమ్లా నాయక్ పై ఫోకస్ పెట్టాడో ఈ పాటను చూస్తుంటే అర్థం అవుతుంది. ఈ పాట కోసం ప్రత్యేకంగా డాన్సర్స్ తో చేయించిన విజువల్స్ కన్నులకు విందుగా ఉన్నాయి. సినిమాలో పాట ఏ సందర్బంలో వస్తుందో ఊహించుకోవచ్చు. పవన్ పాత్రను హైలైట్ చేయడంలో కచ్చితంగా ఈ పాట కీలకం అవుతుందని అంటున్నారు.
రీమేక్ అయినా కూడా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా కమర్షియల్ మూవీగా మార్చేశారు. వకీల్ సాబ్ ను ఎలా అయితే కమర్షియల్ రీమేక్ గా మార్చారో అచ్చు ఈ సినిమాను కూడా హీరో సెంట్రిక్ మూవీగా మార్చేశారు. పవన్ కు జోడీగా నిత్యా మీనన్ నటించడం ఈ సినిమా మరో ప్రత్యేకత అనుకోవచ్చు. రానా సరసన సంయుక్త మీనన్ నటించింది. వచ్చే సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేయాలని అనుకున్నారు, కానీ ఆర్ఆర్ఆర్ సంక్రాంతికి రిలీజ్ కావడం వలన మూవీని ఫిబ్రవరిలో విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ గురించి అందరికీ తెలిసిందే. ఈయన ఏది చేసినా సంచలనమే అవుతుంది. అయితే తాజాగా ఈయన…
బ్యాంకు ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారికి కెనరా బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది. కెనరా బ్యాంకులో కాంట్రాక్టు బేసిస్ విధానంలో స్పెషలిస్ట్…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను…
న్యూఢిల్లీలో ఉన్న ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ ప్రైవేటు బ్యాంకింగ్ సంస్థల్లో ఒకటైన హెచ్డీఎఫ్సీ బ్యాంకు పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న…
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న…
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న…