Bhimla Nayak : సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కుతున్న సినిమా భీమ్లా నాయక్. ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటోంది. ప్రస్తుతం క్లైమాక్స్ సన్నివేశాలను హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకి సంబంధించిన సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ సినిమాకు ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ కళ్ళు చెదిరే ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమాను డైరెక్ట్ గా ఓటీటీ లో విడుదల చేస్తే ఏకంగా రూ.150 కోట్లు చెల్లించనున్నట్లు అమెజాన్ ఈ సినిమాకు అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. అయితే ఈ సినిమాను థియేటర్‌లల విడుదల చేస్తే ఎంతో ఈజీగా 100 కోట్ల షేర్ల ను వసూలు చేస్తుంది. కానీ అమెజాన్ ఏకంగా రూ.150 కోట్లు ప్రకటించడం గమనార్హం.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల కానుంది. అయితే అదే సమయంలో రాజమౌళి RRR విడుదల కావడంతో ఈ సినిమాను పోటీగా సంక్రాంతి బరిలోకి దింపుతారా ? లేకపోతే విడుదల తేదీని వాయిదా వేసుకుంటారా ? ఇవి రెండూ కాకుండా ఈ సినిమాను ఓటీటీ లో విడుదల చేస్తారా.. అనే విషయం తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో పవన్ సరసన నిత్యమీనన్, రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…