Beast Movie : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డె ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం బీస్ట్.. ఏప్రిల్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా నచ్చలేదని విజయ్ ఫ్యాన్స్ ఏకంగా ఓ థియేటర్‌లో స్క్రీన్‌కి నిప్పు పెట్టారు. అయితే సినిమాకి నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లలో మాత్రం దూసుకుపోతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ అప్‌డేట్ కూడా వచ్చేసింది. నెట్ ఫ్లిక్స్, సన్ నెక్ట్స్ ఈ చిత్రాన్ని మే 11 నుండి తమ ఫ్లాట్ ఫాంలలో స్ట్రీమింగ్ చేయనున్నాయి.
కాగా.. బీస్ట్ ఉగ్రవాద నేపథ్యంలో సాగే సినిమా. ఓ మాల్‌ను ఉగ్రవాదులు హైజాక్ చేసిన సమయంలో.. అందులోనే ఉన్న హీరో విజయ్.. అక్కడి జనాలను ఎలా రక్షించాడనేదే కథ. విజయ్ నటన ఆకుట్టుకున్నప్పటికీ.. కథ, కథనాలు ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అవలేదు. ఫస్టాఫ్ కొంత ఫర్వాలేదు అనిపించినా.. సెకండాఫ్ మాత్రం బోర్ కొట్టించిందని సినిమా చూసిన జనాలు అభిప్రాయపడుతున్నారు. బీస్ట్ నెగెటివ్ టాక్ తెచ్చుకోవడంతో విజయ్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు.
అయితే బీస్ట్ చిత్రం మాత్రం కోలీవుడ్‌లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. రెండు రోజుల్లోనే రూ.వంద కోట్లు రాబట్టింది. మూడు రోజుల్లోనే రూ.150 కోట్ల క్లబ్బులో చేరిపోయింది. అయితే ఈ చిత్రం మిగతా అన్ని చోట్లా డిజాస్టర్‌గా మిగిలే అవకాశం ఉంది. పాన్ ఇండియా అంటూ అన్ని భాషల్లోనూ ఈ సినిమాను విడుదల చేశారు. మరీ ముఖ్యంగా నార్త్‌లో ఈ సినిమా దారుణమైన ఫలితాన్ని మూటగట్టుకుంది. ఇక సినిమా నెగెటివ్ టాక్ ను తెచ్చుకోవడంతోపాటు.. కేజీయఫ్ చాప్టర్ 2 ప్రభంజనం ముందు కూడా వెలవెలబోయింది. బీస్ట్ కలెక్షన్లు ఘోరాతిఘోరంగా ఉన్నాయి. తమిళనాడులో సైతం విజయ్‌కి గట్టిపోటినిస్తూ యష్ వసూళ్లను రాబట్టాడు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…