Jabardasth : జబర్ధస్త్ షో వేదికగా రాకింగ్ రాకేష్, జబర్ధస్త్ సుజాత ప్రేమ వ్యవహారం బయటపడిన విషయం తెలిసిందే. కొన్నాళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న సుజాత, రాకేష్ తాజాగా నిశ్చితార్ధం జరుపుకున్నారు. అయితే ఇది కార్యక్రమంలో భాగంగా జరిగింది. ప్రతి శుక్రవారం బుల్లితెరపై సందడి చేసే కామెడీ ప్రోగ్రాం జబర్ధస్త్. ఈ కార్యక్రమంలో సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్.. ఇమ్మాన్యూల్, వర్ష, రాకింగ్ రాజేష్ లాంటి కమెడియన్లు తమ స్కిట్స్ తో ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నారు. ఒకరిని మించేలా మరొకరు స్కిట్స్ తో ముందుకు వస్తున్నారు.
తాజాగా ప్రోమో విడుదల కాగా.. ఇందులో ఇమ్మాన్యూల్ కేజీఎఫ్ 2 పేరడీతో వచ్చేశాడు. ఇందులో ఇమ్మాన్యూల్ రాకీ భాయ్ గా నటించగా.. అధీర పాత్రలో భాస్కర్ గెటప్ విశేషంగా ఆకట్టుకుంటోంది. బుల్లెట్ భాస్కర్ గెటప్ చూసి.. నువ్వెవరో నాకు తెలుసు.. రాకేష్ మాస్టర్ కదా.. అంటూ ఇమ్మాన్యూల్ నవ్వులు పూయించాడు. ఇక సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్ విభిన్నమైన స్కిట్ తో రెడీ అయ్యారు. ఆటో రాంప్రసాద్ లేడీ గెటప్ కామెడీగా ఉంది.
ఇక ఈ ప్రోమోలో బిగ్ సర్ ప్రైజ్ ఏంటంటే.. జబర్దస్త్ లవ్ జోడీగా ఉన్న రాకింగ్ రాకేష్, సుజాత షోలోనే నిశ్చితార్థం చేసుకున్నారు. ఇద్దరూ సాంప్రదాయ వస్త్రధారణలో వధూవరులుగా వెలిగిపోతున్నారు. రాకేష్ సుజాతకి రింగ్ తొడుగుతూ కనిపించాడు. నిశ్చితార్థం తరహాలో రింగు తొడిగిన రాకేష్.. సుజాతతో నీ పెళ్లి అయిపోయిందిగా.. అని చెప్పడం కాస్త గందరగోళంగా ఉంది. దీనిపై క్లారిటీ రావాలంటే 6వ తేదీ పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
ఇదిలా ఉండగా సుజాత తన ఆత్మీయుడు, స్నేహితుడు, అంతకు మించిన అయిన రాకేష్‌కి తాను ఫోన్ కొనిస్తున్నట్టు చెప్పింది. అయితే ఆయనకు తెలియకుండా సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్టు ముందుగా చెప్పింది. హైదరాబాద్‌లోని అమీర్ పేటలో ఉన్న ఓ షోరూమ్‌కి తీసుకెళ్లింది. అయితే తానే ఫోన్ కొంటున్నట్టు కలరింగ్ ఇచ్చింది సుజాత. రాకేష్ కూడా అలాగే ఫీలయ్యాడు. ఆ ఫోన్ ఫీచర్స్ అన్నీ వెల్లడించారు. అంతా అయిపోయాక సడెన్‌గా ఈ ఫోన్ నీకే.. అంటూ రాకేష్ కి ఇచ్చింది సుజాత. దీంతో అందరూ షాకయ్యారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…