Bangarraju : కింగ్ నాగార్జున వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులకి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బంగార్రాజు అనే చిత్రం చేస్తుండగా, ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. బంగార్రాజు యవ్వనంలో ఎలా ఉండేవాడో అనేట్టుగా నాగ చైతన్యను ఈ చిత్రంలో చూపించినట్టు కనిపిస్తోంది. నాగ చైతన్య బర్త్ డే ( నవంబర్ 23) సందర్బంగా నిన్న ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ రోజు టీజర్ రిలీజ్ చేశారు.
టీజర్‌లో నాగ చైతన్య ‘పూలచొక్కాతో జోరుగా ముస్తాబై చిద్విలాసంగా కనిపిస్తున్నాడు . ఆ నవ్వుల వెకున్న మతలబు ఏమిటో.. ఈ జూనియర్ సోగ్గాడిని వలచిన వయ్యారి ఎవరో తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే’ అంటున్నారు కల్యాణ్‌కృష్ణ. టీజర్ ప్రేక్షకులకి మంచి వినోదం పంచింది. చిత్రంలో అక్కినేని నాగార్జున, నాగచైతన్య హీరోలుగా నటిస్తున్నారు. ఇది అక్కినేని మల్టీ స్టారర్‌గా రూపొందుతోంది.
అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ పతాకాలపై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రమ్యకృష్ణ, కృతిశెట్టి కథానాయికలు. ఇందులో రొమాన్స్, ఎమోషన్స్‌తో పాటు వాణిజ్య హంగులన్నీ పుష్కలంగా ఉంటాయి.
నాగార్జున, నాగచైతన్య పాత్రలు మాస్, క్లాస్ మేళవింపుతో నవ్యరీతిలో సాగుతాయి. ఇటీవల విడుదలైన కృతిశెట్టి ఫస్ట్‌లుక్‌తో పాటు ‘లడ్డుందా’ పాటకు చక్కటి స్పందన లభించింది. ప్రస్తుతం మైసూర్‌లో చిత్రీకరణ జరుపుతున్నారు. చలపతిరావు, రావురమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్ అందిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…