Kaikala Satyanarayana : 60 ఏళ్లుగా సినీ రంగంలో ఉన్న కైకాల.. ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించారు. సుదీర్ఘ సినీ కెరీర్ లో సుమారుగా 777 సినిమాల్లో నటించి.. తెలుగు అభిమానులను అలరించారు. మూడు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురైన సత్యనారాయణను కుటుంబ సభ్యులు జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్స్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. అప్పట్నుంచీ ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచి కైకాలకు చికిత్స అందిస్తూ వస్తున్నారు.
ఐసీయూలో చికిత్స పొందుతున్న సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ స్పృహలోకి వచ్చిన విషయం తెలుసుకున్న చిరంజీవి ఇటీవల క్రిటికల్ కేర్ డాక్టర్ సుబ్బారెడ్డి సహాయంతో ఆయనతో ఫోన్‌లో మాట్లాడారు. ఆయన త్వరితగతిన కోలుకుంటారన్న పూర్తి నమ్మకం ఆ క్షణం నాకు కలిగింది. ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో త్వరగా తిరిగి రావాలని ప్రార్థిస్తూ, ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులందరితో ఈ విషయం పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది’’ అని చిరంజీవి పేర్కొన్నారు.
కైకాల మరణించారంటూ మంగళవారం వాట్సాప్‌లో తప్పుడు ప్రచారం మొదలైంది. అయితే ఆ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయొద్దనీ, తమ తండ్రి కోలుకుంటున్నారనీ.. సత్యనారాయణ కుమార్తె రమాదేవి విజ్ఞప్తి చేశారు.
నాన్నగారి పరిస్థితి బాగానే ఉంది. ఆయన కోలుకుంటున్నారు. బాగా స్పందిస్తున్నారు. అందరితో మాట్లాడుతున్నారు. నిన్న మాదాల రవిగారు వచ్చారు. ఆయనతో కూడా మాట్లాడి థమ్సప్ కూడా చూపించారు. కాబట్టి ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. దయచేసి తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలను ఆందోళనకు గురిచేయొద్దు.. అని ఆమె అన్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…