Bandla Ganesh : నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఏం చేసినా వివాదాస్పదం అవుతుంటుంది. మొన్నటికి మొన్న పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాష్ నటించిన చోర్ బజార్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. డైలాగ్‌లు కూడా రాని వాళ్లను మెగాస్టార్, సూపర్ స్టార్, రెబల్ స్టార్‌లను చేశావు.. నీ కొడుకు ఫంక్షన్‌కు నువ్వు లేవు.. ఏంటి అన్నా.. అని పూరీని బండ్ల ప్రశ్నించారు. దీంతో ఆయా స్టార్స్‌కు చెందిన ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. అలాగే పూరీ కూడా బండ్లకు ఇన్‌డైరెక్ట్‌గా చురకలు అంటించారు. అయితే ఆ వివాదం ముగియక ముందే బండ్ల మళ్లీ ఇంకో వివాదంలో ఇరుక్కున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
ప్రముఖ నిర్మాత దిల్ రాజు రెండోసారి తండ్రి అయన విషయం విదితమే. ఆయన రెండో భార్య తేజస్విని మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే 51 ఏళ్ల వయస్సులో ఆయన తండ్రి కావడంతో ఆయనను ట్రోల్ చేస్తున్నారు. ఆయన మొదటి భార్య కుమార్తెకు ఇప్పటికే పిల్లలు ఉన్నారు. ఆయన తాత కూడా అయ్యారు. దీంతో తాత వయస్సులో తండ్రయ్యాడు.. అంటూ ఆయనను ట్రోల్ చేస్తున్నారు. అయితే దిల్ రాజు తండ్రి అయిన సందర్భంగా బండ్ల గణేష్ విషెస్ చెప్పారు. కానీ అక్కడే బండ్ల పప్పులో కాలేశారు.
దిల్‌రాజు చిత్ర నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ అన్న సంగతి అందరికీ తెలుసు. ఎస్‌వీసీ_అఫిషియల్ అనే అకౌంట్ పేరిట ట్విట్టర్ ఖాతా ఉంది. అయితే దీనికి కాకుండా బండ్ల గణేష్ ఎస్‌వీసీసీ అనే ట్విట్టర్ ఖాతాను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌ను ట్యాగ్ చేసిన బండ్ల దిల్ రాజుకు శుభాకాంక్షలు తెలిపారు. కానీ ఎస్‌వీసీసీ అనేది శ్రీవెంకటేశ్వర సినీచిత్ర. ఇది బీవీఎస్ఎన్ ప్రసాద్‌కు చెందినది. దీంతో బండ్ల గణేష్ పెద్ద తప్పే చేశారు. దిల్ రాజుకు శుభాకాంక్షలు చెబుతున్నానని ఆయన అనుకున్నారు కానీ చెప్పింది మాత్రం ప్రసాద్‌కు. ఇది తెలియక చేసిన పొరపాటు.
అయితే దీన్ని సరిదిద్దుకోవచ్చు. కానీ బండ్ల గణేష్ ఆ ట్వీట్‌ను ఇంకా మార్చలేదు. అంటే ఆయన ట్వీట్‌ను పెట్టి అలాగే వదిలేశారన్నమాట. కనీసం దాన్ని చూడను కూడా చూడలేదు. దీంతో నెటిజన్లకు మళ్లీ మంచి మీల్స్ దొరికినట్లు అయింది. బండ్ల గణేష్ చేసిన తప్పును ఎత్తి చూపిస్తూ వారు ఆయనను ట్రోల్ చేస్తున్నారు. కనీసం తెలుసుకోకుండా ఒకరు తండ్రి అయితే ఇంకొకరికి విషెస్ ఎలా చెప్పావన్నా.. సరే ట్వీట్ చేశావు.. కానీ అందరూ ఇంతలా చెబుతున్నా.. కనీసం దాన్ని మార్చాలని ఎందుకు అనుకోవడం లేదు.. అంటూ నెటిజన్లు బండ్లను ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనను పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ విమర్శిస్తున్నారు. మరి ఇప్పటికైనా బండ్ల ఆ మిస్టేక్‌ను సరిచేసుకుంటారా.. లేదా.. అన్నది చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…