Balakrishna : ఇన్నాళ్లూ వెండితెరపై సందడి చేసిన స్టార్స్ ఇప్పుడు బుల్లితెరపై హంగామా సృష్టిస్తున్నారు. ఇప్పటి వరకు చిరంజీవి, నాగార్జున వంటి సీనియర్ హీరోలు బుల్లితెర ప్రేక్షకులని అలరించగా, ఇప్పుడు నందమూరి బాలకృష్ణ కూడా ఎంటర్‌టైన్ చేయడానికి సిద్ధం అయ్యారు. ఓటీటీ వేదికగా బాలకృష్ణ ఓ టాక్ షో చేయబోతున్న విషయాన్ని ఆదివారం ఆహా ఓ పోస్టర్ విడుదల చేసి ప్రకటించింది. ‘ఆయన అడుగేస్తే.. షో మొదలేడితే.. టాక్ షోలన్నింటికీ బాప్ త్వరలో రానుంది..! పైసా వసూల్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు సిద్ధంగా ఉండండి’ అని పేర్కొంది.
అన్‌స్టాపబుల్ అనే పేరుతో మొదలు కానున్న ఈ షో తొలి ఎపిసోడ్లో మోహన్ బాబు, ఆయన పిల్లలు విష్ణు, మనోజ్, లక్ష్మీ ప్రసన్న అతిథులుగా రాబోతున్నట్లు సమాచారం. ఇక ఈ రోజు ఎన్టీఆర్ షోకి సమంత కూడా రానున్నట్టు కన్‌ఫాం అయింది. జెమిని టీవీలో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసే ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’లో సమంత పాల్గొన్న విషయాన్ని ప్రోమో వీడియో ద్వారా కన్‌ఫాం చేశారు. ప్రోమోలో సమంత సీట్ చాలా హాట్‌గా ఉందని చెప్పడంతోనే ఈ షోపై అంచనాలు పెరిగాయి. దసరా నవరాత్రుల స్పెషల్‌గా ఈ ఎపిసోడ్ రాబోతోందని ప్రకటించారు.
ఇక ఈ రోజు బిగ్ బాస్ స్పెషల్ ఎపిసోడ్ ప్రసారం కానుంది. సాయంత్రం 6గం.ల నుండి బిగ్ బాస్ కార్యక్రమం మొదలు కానుండగా, ఈ కార్యక్రమానికి అఖిల్, పూజా హెగ్డే గెస్ట్‌లుగా హాజరయ్యారు. వీరిద్దరూ కలిసి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్ర ప్రమోషన్ లోభాగంగా బిగ్ బాస్ స్టేజ్‌పై సందడి చేయనున్నట్టు తెలుస్తోంది. నాగార్జున బంగర్రాజు గెటప్‌లో షోకి హాజరు కాగా, ఆయన పలువురు స్టార్స్‌తో కలిసి సందడి చేయనున్నారు. ఏదేమైనా వెండితెర స్టార్స్ బుల్లితెరపై రచ్చ చేస్తుండడం అభిమానులకి చాలా ఆనందాన్ని కలిగిస్తోందని చెప్పవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…