Maa Elections : మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల వార్ ముగిసింది. గత కొద్ది రోజులుగా ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్స్ మధ్య ఫైటింగ్ హోరాహోరీగా సాగింది. నువ్వా నేనా అన్నట్టుగా ఒకరిపై ఒకరు మాటల దాడులు చేసుకున్నారు. అయితే ఈ రోజు (ఆదివారం) ఉదయం జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ లో 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కాగా, కొద్ది సేపటి క్రితం ముగిసింది. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈ సారి పోలింగ్ సమయాన్ని గంట మేర పొడిగించారు. 2 గంటలకు ముగియాల్సిన ఓటింగ్‌ని 3 గంటల వరకు కొనసాగించారు.
రికార్డ్ స్థాయిలో ఓటింగ్ జరిగినట్టు తెలుస్తుండగా, ఇంకొందరు లైన్‌లో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే పోలింగ్ కేంద్రం గేట్స్ మూసి వేయగా, లోపల ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. చివరి నిమిషంలో వచ్చిన అనసూయ ఓటు హక్కు వినియోగించుకుంది. మొత్తం 72 శాతం పోలింగ్ నమోదైనట్టు తెలుస్తోంది. మొత్తం మా ఓటర్స్ 905 కాగా, 665 మంది ఓటు వేసినట్టు సమాచారం. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ జరగనుండగా, రాత్రి 11 గంటలకు రిజల్ట్ రానుంది.
మహేష్, ప్రభాస్, రానా, అల్లు అర్జున్, రకుల్, హన్సిక, త్రిష, నాగ చైతన్య, సమంత, కళ్యాణ్ రామ్‌తో పాటు పలువురు ప్రముఖులు ఓటింగ్‌కి దూరంగా ఉన్నారు. జెనీలియా స్పెషల్‌గా ఓటింగ్ కోసం హైదరాబాద్ రావడం విశేషం. పవన్ కళ్యాణ్ ‘మా’ ఎన్నికల్లో తొలి ఓటును వినియోగించుకున్నారు. అందరికంటే ముందే ఉదయం పోలింగ్ కేంద్రానికి చేరుకొని మొదటి ఓటు వేశారు. ఆ తర్వాత సినీ ప్రముఖులు అంతా ఒక్కొక్కరుగా వచ్చి ఓటు వేశారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…