Balakrishna : ఆ సినిమా షూటింగ్ కోసం ముగ్గురు హీరోలు వెళ్లారు.. కానీ దీవుల్లో ప్ర‌మాదంలో చిక్కుకున్నారు..

Balakrishna : నందమూరి నట వారసుడిగా అరంగేట్రం చేసి నాలుగు దశాబ్దాలుగా తెలుగు తెరపై తన ప్రత్యేకతను చాటి చెప్పారు నటసింహ బాలకృష్ణ. నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. బాలయ్య బాబు చిత్రం రిలీజ్ అయిందంటే చాలు ప్రేక్షకులకు ఆ సినిమా మీద భారీ అంచనాలతో థియేటర్లకు క్యూ కట్టేస్తారు. టాలీవుడ్ ఇండస్ట్రీ హీరోలందరిలో బాలయ్యకు ఉన్న క్రేజ్ వేరు. ప్రస్తుతం బాలకృష్ణ ఇటు సినిమాల‌తోనూ, అటు రాజకీయాలతోనూ ఫుల్ బిజీగా ఉన్నారు.

1999లో బాల‌కృష్ణ న‌టించిన సుల్తాన్ సినిమా అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో నటించారు. ఈ చిత్రంలో ఒక బాలకృష్ణ దేశభక్తి కలవాడు గానూ, మరొక బాలకృష్ణ దేశద్రోహిగా అంటే విలన్ గా నటించి అందరినీ ఆకట్టుకుని మంచి మార్కులు దక్కించుకున్నారు.  అప్పట్లో ఈ సినిమా సూప‌ర్ హిట్ కాక‌పోయినా థియేటర్ల వద్ద యావరేజ్ కలెక్షన్లను రాబట్టింది.

Balakrishna

ఇక సుల్తాన్ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా సూప‌ర్ స్టార్‌ కృష్ణ, ఇంటెలిజెంట్ సిబిఐ ఆఫీసర్ గా  రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజు ఇద్ద‌రూ థియేటర్ల‌లో చూసే ప్రేక్షకులతో విజిల్స్ ప‌డేవిధంగా న‌టించారు. ఇలా ముగ్గురు అగ్రస్థాయి కథానాయకులతో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో ఇండస్ట్రీలో ఓ హైప్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా బాల‌య్యను ట్రైల‌ర్ లో ప‌లు పాత్ర‌ల్లో చూసి ఈ చిత్రం కచ్చితంగా భారీ విజయాన్ని సాధిస్తుందని అందరూ ఊహించుకున్నారు. అందరి ఊహలను తారుమారు చేస్తూ ఈ సినిమాకి ఆశించిన మేరకు ఫ‌లితం ద‌క్క‌లేదు.

సుల్తాన్ చిత్రం కోసం ద‌ర్శ‌కుడు శ‌ర‌త్, రచయితలు ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ చాలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నార‌ట‌. ఇందులో ముగ్గురు స్టార్ హీరోల్లో ఎవ‌రి ఇమేజ్‌కి తగ్గకుండా హీరోల పాత్ర‌ల‌ను క్రియేట్ చేశారు. ఈ సినిమా క‌థ రాసుకున్న‌ప్పుడే ఒకరు ప‌వ‌ర్ పుల్ సీబీఐ ఆఫీస‌ర్‌గా, ఒకరు పోలీస్ ఆఫీస‌ర్ గా ఎవ‌రైతే బాగుంటార‌ని చర్చ‌లు జ‌రిగాయ‌ట‌. అప్పుడు ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్‌ని సీబీఐ ఆఫీస‌ర్ గా కృష్ణంరాజు, పోలీస్ ఆఫీస‌ర్‌గా కృష్ణ తీసుకుంటే బాగుంటుంద‌ని బాలయ్య బాబు సూచించార‌ట‌.

ఈ సినిమా షూటింగ్‌ని మొదటిగా కృష్ణ‌, కృష్ణంరాజుల‌కు సంబంధించిన పార్ట్‌ను చేద్దామ‌ని బాల‌కృష్ణ అనడంతో దర్శక నిర్మాతలు అండమాన్ దీవుల్లో షూటింగ్ పనులను ప్రారంభించారట. సినిమా షూటింగ్ అండ‌మాన్ దీవుల్లో ఉండ‌డంతో స‌ర‌దాగా మ‌న ఫ్యామిలీస్ తో ట్రిప్ వేసిన‌ట్టు ఉంటుంద‌ని భావించి కృష్ణ‌, కృష్ణంరాజు, బాల‌కృష్ణ వారి వారి కుటుంబాలతో సహా వెంట బెట్టుకొని అంద‌రూ అండ‌మాన్ వెళ్లార‌ట‌. అక్క‌డ వాతావ‌ర‌ణం, లొకేష‌న్లు బాగున్న‌ప్ప‌టికీ ఉండ‌డానికి మాత్రం రాజీవ్ గాంధీ గెస్ట్ హౌజ్ త‌ప్ప వేరే ప్రత్యేకత లేదంట. అండమాన్ దీవులలో తిన‌డానికి తిండికూడా దొరికేది కాద‌ట‌. ఇక చేసేదేమీ లేక అంద‌రూ అక్క‌డే అడ్జ‌స్ట్ అయ్యారు. అక్క‌డికి వెళ్లిన మొదటి రోజు అయితే అక్క‌డ తిన‌డానికి కూడా ఏమీ దొరకకపోవడంతో బిస్క‌ట్లు, చిన్న చిన్న చిరుతిండ్ల‌తో కాలం గ‌డిపేశార‌ట‌.

ఆ త‌రువాత రోజు బ‌య‌ట నుంచి బియ్యం, కూర‌గాయలు తెప్పించార‌ట‌. ఉన్నటువంటి కొద్దిపాటి సదుపాయాలతోనే విజ‌య నిర్మ‌ల అద్భుతంగా వంట చేసి పెడితే అంద‌రూ తృప్తిగా కడుపునిండా తిన్నార‌ట‌. బాల‌య్య ఎప్పుడూ అందరితో సరదాగా ఉండే మనిషి కాబట్టి షూటింగ్ స్పాట్ దగ్గర్లోనే స‌ముద్రంలోని చేప‌ల‌ని వేటాడి మ‌రీ ప‌ట్టుకొచ్చి విజ‌యనిర్మ‌ల‌కి ఇచ్చేవారు. ఆమె వాటితో అద్భుతంగా చేప‌ల పులుసు పెట్టేది. ఆ చేప‌ల పులుసు అదిరిపోవ‌డంతో లొకేష‌న్‌లోకి కూడా ప‌ట్టుకెళ్లార‌ట‌ బాలయ్య బృందం. సినిమా టీం అంతా విజ‌య‌నిర్మ‌ల వంట‌ని ఔరా అంటూ లొట్టలువేసుకుంటూ తిన్నార‌ట‌. దీంతో ఇండ‌స్ట్రీలో విజ‌య‌నిర్మ‌ల చేప‌ల పులుసుకి మంచి పేరు వ‌చ్చింది. ఇలా ముగ్గురు స్టార్స్ అండమాన్ లో కుటుంబంతో ఎంతో సరదాగా గడిపారు.

Share
Mounika

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM