Balakrishna : నందమూరి నటసింహం బాలకృష్ణ తొలిసారి ఆహా కోసం హోస్ట్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ షోకి సంబంధించి ప్రోమో విడుదల చేయగా, ఇందులో ఇటు బాలకృష్ణ, అటు మోహన్ బాబు సంధించిన ప్రశ్నలకు అభిమానులలో అనేక ఆలోచనలు మొదలయ్యాయి. ముఖ్యంగా మోహన్ బాబు.. బాలయ్యని ఎన్టీఆర్ తర్వాత మీరెందుకు తెదేపా పగ్గాలు తీసుకోలేదని ప్రశ్నించారు.
మోహన్ బాబు ప్రశ్నకి స్పందించిన బాలకృష్ణ.. మా తెలుగుదేశం పార్టీ పెట్టిందే వారసత్వ రాజకీయాలకి అతీతంగా.. పెద్దాయన తరువాత మేము తీసుకుంటే ఇంక దానికి అర్థం ఏం ఉంటుంది. చంద్రబాబు చాలా కష్టపడే తత్త్వం ఉన్న వ్యక్తి. ఆయన కాలేజీ, గ్రామ, మండల స్థాయి రాజకీయాల నుండి అన్నీ చూసి వచ్చిన మనిషి. ఆయన కాబట్టే ఆ బాధ్యతలను అలా చేయగలిగాడు. అన్నగారి ఆశయాలను ముందుకి తీసుకెళ్ల గలిగాడు.. అంటూ బాలయ్య సమాధానం ఇచ్చారు.
మీరు నటించిన సినిమాల్లో అస్సలు చూసుకోలేని సినిమా ఏది అని బాలకృష్ణ అడిగితే, ‘‘పటాలం పాండు’ చేసిన తర్వాత నా భార్య నిర్మల వారం రోజులు మాట్లాడలేదు’’ అని చెప్పారు. తన బ్యానర్‌లో వరుసగా సినిమాలు ఫ్లాప్ అయితే, మహాబలిపురంలో భూములు అమ్మి అందరికీ డబ్బులు చెల్లించినట్లు మోహన్‌బాబు తెలిపారు. ఆ తర్వాత ‘అల్లుడుగారు’, ‘అసెంబ్లీ రౌడీ’, ‘బ్రహ్మ’, ‘పెదరాయుడు’ వరుస విజయాలతో నిలబడ్డానని వివరించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…