Balakrishna : నందమూరి బాలకృష్ణ అంటే కేవలం సినిమాలు మాత్రమే కాదు ఆయన అనుకుంటే హోస్ట్ గా కూడా మెప్పించగలరని అన్‌స్టాపబుల్ షోతో నిరూపించారు. బాలయ్య టాలెంట్ చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. త్వరలో మరో సీజన్‌ని కూడా హోస్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అయితే గత ఏడాది అఖండతో బ్లాక్ బస్టర్ కొట్టిన బాలకృష్ణ అదే ఉత్సాహంతో గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రవితేజ తో క్రాక్ సినిమాను తెరకెక్కించిన గోపీచంద్ మలినేని ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

క్రాక్ సినిమాతో డైరెక్టర్ గోపీచంద్ మలినేని స్థాయి ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో బాలకృష్ణతో సినిమా చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఓ ఖతర్నాక్ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది. ఈ చిత్రానికి అన్నగారు అనే పేరు పెట్టారని, త్వరలోనే అధికారికంగా కన్ఫర్మేషన్ రానుందని సమాచారం. గతంలో సీనియర్ ఎన్టీఆర్‌ని అందరూ అన్నగారు అని పిలిచిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఆయనను అలాగే పిలుస్తుంటారు. దీంతో అదే పేరును బాలకృష్ణ కొత్త సినిమాకు పెట్టనున్నారని తెలుస్తోంది. దీంతో ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఈ సినిమాలో బాలయ్య సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కేక పెట్టిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.
బాలయ్య సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలకృష్ణ ఈ సినిమాలో విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఒక పాత్రలో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మరొక పాత్రలో సాఫ్ట్ గా కనిపించే బిజినెస్‌మ్యాన్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికిపైగా పూర్తి అయినట్లు సమాచారం. దర్శకుడు గోపీచంద్ మలినేని మరికొన్ని రోజుల్లో ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి ఫస్ట్ లుక్ టీజర్ ను కూడా విడుదల చేయాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.