Balakrishna : గత కొద్ది నెలలుగా ఏపీలో సినిమా టిక్కెట్ల రేట్లపై తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎంతో లాబీయింగ్ చేసింది. అయినప్పటికీ రేట్లను తగ్గించే ప్రసక్తే లేదని ఏపీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీంతో ఆ రాష్ట్రంలో విడుదల కానున్న సినిమాలపై టిక్కెట్ల ధరల ప్రభావం పడనుంది. టిక్కెట్ల ధరలను తగ్గిస్తే వచ్చే ఆదాయం తగ్గుతుంది కనుక బయ్యర్లు కూడా తాము సినిమా కొన్న ధరలో 30 శాతం తగ్గింపు కావాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే నిర్మాతలు బయ్యర్లతో చర్చలు జరిపి ఆ మొత్తాన్ని 20 శాతానికి తగ్గించారు. దీంతో అంతిమంగా నిర్మాతలకు నష్టం రానుంది. ఇక ఈ విధానం వల్ల మొదటగా ఎఫెక్ట్ పడేది బాలయ్య సినిమా పైనే. డిసెంబర్ లో ముందుగా ఆయన సినిమానే విడుదల కానుంది. ఇప్పటికే ఆ మూవీని ఆంధ్రాలో రూ.35 కోట్లకు, సీడెడ్ ఏరియాల్లో రూ.12 కోట్లకు అమ్మారు. ఆ మొత్తంలో 20 శాతం మేర అంటే.. దాదాపుగా రూ.9.40 కోట్ల మేర అఖండ నిర్మాతలు నష్టపోనున్నారు.
అయితే ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరిపి టిక్కెట్ల ధరలను పెంచకపోతే మాత్రం ఆ ప్రభావం ఇతర సినిమాలపై కూడా పడుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఈ క్రమంలోనే రానున్న 2 నెలల్లో విడుదలయ్యే పలు సినిమాల నిర్మాతలు ఏకంగా రూ.70 కోట్ల మేర నష్ట పోతారని లెక్కలు వేస్తున్నారు.
రానున్న నెలల్లో అల్లు అర్జున్ పుష్ప, రాజమౌళి ఆర్ఆర్ఆర్, ఆచార్య, భీమ్లా నాయక్, సర్కారు వారి పాట వంటి మూవీలు విడుదల కానున్నాయి. ఈ క్రమంలోనే ఈ మూవీల నిర్మాతలు రూ.70 కోట్ల మేర నష్టపోతారని తెలుస్తోంది. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…