Sajjanar : తెలంగాణ ఆర్‌టీసీని కించపరిచేలా యాడ్ తీశారంటూ ర్యాపిడీ అనే ట్యాక్సీ సంస్థతోపాటు ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌కు టీఎస్ఆర్‌టీసీ ఎండీ వీసీ సజ్జనార్ లీగల్ నోటీసులు పంపించిన విషయం విదితమే. అయితే ఈ విషయంపై సజ్జనార్ మాట్లాడారు. వ్యక్తిగతంగా ఈ విషయాన్ని తీసుకోవద్దని ఆ సంస్థతోపాటు అల్లు అర్జున్‌కు సూచించారు.
తనకు అల్లు అర్జున్‌తో పర్సనల్‌గా ఎలాంటి ఇష్యూస్ లేవని సజ్జనార్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఓ యూట్యూబ్ వీడియోను విడుదల చేశారు. లీగల్ నోటీసులు పంపాలని తనకు ఆసక్తి లేదని, కానీ ప్రజా రవాణా వ్యవస్థలో ముఖ్య భాగం అయిన ఆర్‌టీసీని కించపరిచేలా యాడ్ తీయడం, అందులో అల్లు అర్జున్ నటించడం సమంజసం కాదన్నారు.
ఇప్పటికే ఆర్టీసీ నష్టాల్లో ఉందని, ఈ విధంగా యాడ్ లు తీయడం వల్ల ఆర్టీసీ ఇంకా నష్టపోతుందని అన్నారు. సెలబ్రిటీలను అనేక మంది ఫాలో అవుతారని, వారికి అనేక మంది ఫ్యాన్స్ ఉంటారని, కనుక వారు సమాజానికి ఉపయోగపడే విధంగా మెసేజ్‌లను ఇవ్వాలని కోరారు. అంతేకానీ.. ఎంతో మంది పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు రోజూ ప్రయాణించే ఆర్‌టీసీ వ్యవస్థను కించ పరిచేలా యాడ్స్ తీయడం సరికాదన్నారు.
ఈ యాడ్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని, టీఎస్ఆర్‌టీసీకి క్షమాపణలు చెప్పాలని సజ్జనార్ అన్నారు. లేదంటే చట్ట ప్రకారం ముందుకు కొనసాగుతామని స్పష్టం చేశారు. అయితే దీనిపై అటు ర్యాపిడో గానీ, ఇటు అల్లు అర్జున్ గానీ స్పందించాల్సి ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…