Balakrishna : ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం తారాస్థాయికి చేరుకుంది. భౌతిక దాడులతో ప్రజలు వణికిపోతున్నారు. మంగళవారం తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత పట్టాభి ఇంటిపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు దాడులు చేయడం కలకలం సృష్టించింది. ఇదే సమయంలో మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై కూడా వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. వైసీపీ నేతల దాడుల్లో భాగంగా హిందూపూర్‌లోని ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటిపై వైసీపీగా కార్యకర్తలుగా భావిస్తున్న కొందరు దాడులకు దిగారని సమాచారం.
హిందూపూర్‌లో భారీగా వైసీపీ కార్యకర్తలు మొహరించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్టు సమాచారం. తన ఇంటిపై, కార్యాలయంపై జరిగిన దాడి సమయంలో బాలకృష్ణ హిందూపూర్‌లో లేరని తెలుస్తున్నది. అయితే ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకొంటూ పరిస్థితులను పర్యవేక్షిస్తున్న బాలయ్య హిందూపూర్‌కు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తున్నది.
వైసీపీ కార్యకర్తలు జరిపిన దాడుల్లో సీనియర్ ఎన్టీఆర్ విగ్రహంపై దాడికి పాల్పడ్డారు. ఎన్టీఆర్ విగ్రహం ముందు ఉన్న గ్లాస్‌ను పగలకొట్టేందుకు ప్రయత్నించారు. అయితే ఈ దాడి సీనియర్ ఎన్టీఆర్‌పై జరిపిన దాడిగా టీడీపీ కార్యకర్తలు అభివర్ణిస్తున్నారు. దీనిపై పార్టీలకు అతీతంగా పోరాడాలని అంటున్నారు. ఇలా వరుస దాడి ఘటనల నేపథ్యంలో సోషల్ మీడియాలో వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ అభిమానులు పోస్టులతో అల్లాడిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…