Balakrishna : వయోభారం కారణంగా సీనియర్ స్టార్స్‌కి సంబంధించిన సమస్యలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇటీవల చిరంజీవి చేతికి శస్త్ర చికిత్స జరగగా, ఇప్పుడు బాలకృష్ణ భుజానికి ఆపరేషన్ జరిగినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. గత ఆరు నెలలుగా బాలకృష్ణ భుజం నొప్పితో బాధపడుతున్న నేపథ్యంలో ఆయన బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రిలో అక్టోబర్ 31న శస్త్ర చికిత్స చేయించుకున్నారట.
ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రఘువీర్‌రెడ్డి, డాక్టర్ బి.ఎన్.ప్రసాద్‌ల బృందం నాలుగు గంటల పాటు శ్రమించి విజయవంతంగా శస్త్రచికిత్సను పూర్తి చేసింది. ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం బాలకృష్ణ తెలుగు ఓటీటీ మాధ్యమమైన ఆహాలో అన్‌స్టాపబుల్ అనే టాక్‌షో కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఈ షోకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. తొలి ఎపిసోడ్‌లో మోహన్ బాబు చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. తర్వాత రానా దగ్గుబాటి,నాని, ఎన్టీఆర్ హాజరు కాబోతున్నారని తెలుస్తోంది. మరోవైపు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ‘అఖండ’ విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు. దీని తర్వాత గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…