Balakrishna Fan : నట సింహం నందమూరి బాలకృష్ణకు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. బాలయ్య నటించిన సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుంది. మాస్ ప్రేక్షకులు మెచ్చే సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్నారు. బాలకృష్ణ ఇటు సినిమాలోతోనూ, అటు రాజకీయాలతోనూ ఫుల్ బిజీగా ఉన్నారు. బాలయ్యలో రెండు కోణాలు కనిపిస్తుంటాయి. ఆయన ఎంత కోపంగా కనిపిస్తారో.. అంతే ప్రేమ కూడా కురిపిస్తుంటారు. అందుకే బాలయ్యను అభిమానులు అంతగా ఇష్టపడుతుంటారు. బాలయ్యతో సెల్ఫీలు, ఫోటోలు దిగాలని అభిమానులు ఆరాటపడుతూ ఉంటారు.
ఇదిలా ఉండగా బాలయ్యను దగ్గర నుంచి చూసేందుకు ఓ వీరాభిమాని పెద్ద సాహసం చేశాడు. ఈ సాహసం ఇప్పుడు వీడియో రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా బాలయ్య ప్రాథినిత్యం వహిస్తోన్న హిందూపురం నియోజకవర్గం వరదలతో అతలాకుతలం అవుతోంది. దీంతో బాలయ్య అక్కడే మకాం వేసి మరీ సేవా కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ వాగు వద్ద కూలిపోయిన వంతెన బాలయ్య పరిశీలిస్తున్నారు. ఆ సమయంలో వాగు చాలా ఉధృతంగా ప్రవహిస్తోంది.

వంతెనకు అటు వైపు ఉన్న జనాల్లోనుంచి ఓ వీరాభిమాని బాలయ్యను దగ్గర నుంచి చూసేందుకు వస్తూ వాగులో దూకేశాడు. పలువురు అతడిని వారిస్తున్నా వినిపించుకోలేదు. అలా ఆ వాగులో కొంతదూరం కొట్టుకుపోయాడు. చివరకు ఎలాగోలా కష్టపడి ఒడ్డుకు చేరుకున్నాడు. సదరు అభిమాని ఒక్కసారిగా దూకేయడంతో బాలయ్య సైతం ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అయితే ఆ అభిమాని ఒడ్డుకు చేరుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. బాలయ్య వీరాభిమానులు ఎంత రిస్క్ అయినా చేస్తారనేందుకు ఈ సంఘటనే నిదర్శనం.
https://twitter.com/SweetyChittine1/status/1582274123530899456