Balakrishna : దటీజ్ బాలయ్య.. సామాన్యుడితో ఏం చేశాడో చూడండి..!

Balakrishna : నట సింహం నందమూరి బాలకృష్ణకు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. బాలయ్య నటించిన సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుంది. బాలకృష్ణ ఇటు సినిమాలోతోనూ, అటు రాజకీయాలతోనూ ఫుల్ బిజీగా ఉన్నారు. మొన్న అఖండతో మరో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. అఖండ తర్వాత ప్రస్తుతం మలినేని గోపీచంద్ దర్శకత్వంలో 107వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్యలో రెండు కోణాలు కనిపిస్తుంటాయి. ఆయన ఎంత కోపంగా కనిపిస్తారో.. అంతే ప్రేమ కూడా కురిపిస్తుంటారు. అందుకే బాలయ్యను అభిమానులు అంతగా ఇష్టపడుతుంటారు.

తాజాగా 107వ‌ సినిమా షూటింగ్ కోసం టర్కీ వెళ్లిన బాలయ్య అక్కడ కూడా సందడి చేస్తున్నారు. సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న బాలయ్య.. ఇతర మాతాలను ఎలా గౌరవిస్తారు.. హిందూ ధర్మాన్ని ఎలా ఆరాధిస్తారు అన్నది స్పష్టంగా కనిపించింది. గతంలో ఆయన ఓ పొలిటికల్ మీటింగ్ లో పాల్గొన్నప్పుడు.. అక్కడ నమాజ్ వినిపిస్తే.. ఒక్కసారి తన స్పీచ్ ఆపేశారు.. ఇలా చాలా సందర్భాల్లో ఇతర మతాలను బాలయ్య గౌరవిస్తూ వచ్చారు. తాజాగా టర్కీలో ఓ రెస్టారెంట్ లో ముస్లిం కుటుంబంతో కలిసి కూర్చున్న ఆయన వారితో జోక్ లు వేస్తూ మాట్లాడారు. అయితే తాను మందులు వేసుకోబేయే ముందు.. ఎదుటి వారిని ఒక నిమిషం సైలెంట్ గా ఉండమని చెప్పారు. ఆ తరువాత దేవుడిని మనసులో ప్రార్ధించి.. మందులు వేసుకున్నారు.

Balakrishna

ఈ సందర్భంగా తన ఎదుటు కూర్చున్న ఫ్యామిలీతో మాట్లాడిన బాలయ్య జోక్ లు వేస్తూ నవ్వించారు. టీవీని దూరం నుంచి చూస్తే కళ్లకు చాలా మంచిదని.. అదే టీవీని పూర్తిగా చూడడం మానేస్తే.. మెదదుకు చాలా  మంచిదంటూ జోక్ లు పేల్చారు. ఈ సందర్భంగా టీవీ సీరియల్స్ పైనా సైటర్లు వేశారు.. స్టార్ హీరో అని.. ఎమ్మెల్యే అనే హోదా లేకుండా ఓ కుటుంబంతో సరదాగా ఆయన గడిపిన తీరు.. ఫ్యాన్స్ ను మరోసారి ఫిదా అయ్యేలా చేసింది. ఈ సంభాషణను అక్కడ ఉన్న ఓ అభిమాని షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన అభిమానులు దటీజ్ బాలయ్య.. మా బాలయ్య తోపు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Share
Usha Rani

నా పేరు ఉషారాణి. పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం అంటే ఇష్టం. సాహిత్యంపై నాకు కొంత అవగాహన ఉండడంతో రాయాలి అనే ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ లో కంటెంట్ రైటర్ గా చేస్తున్నాను.

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM