Balakrishna : నట సింహం నందమూరి బాలకృష్ణకు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. బాలయ్య నటించిన సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుంది. బాలకృష్ణ ఇటు సినిమాలోతోనూ, అటు రాజకీయాలతోనూ ఫుల్ బిజీగా ఉన్నారు. మొన్న అఖండతో మరో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. అఖండ తర్వాత ప్రస్తుతం మలినేని గోపీచంద్ దర్శకత్వంలో 107వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్యలో రెండు కోణాలు కనిపిస్తుంటాయి. ఆయన ఎంత కోపంగా కనిపిస్తారో.. అంతే ప్రేమ కూడా కురిపిస్తుంటారు. అందుకే బాలయ్యను అభిమానులు అంతగా ఇష్టపడుతుంటారు.
తాజాగా 107వ సినిమా షూటింగ్ కోసం టర్కీ వెళ్లిన బాలయ్య అక్కడ కూడా సందడి చేస్తున్నారు. సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న బాలయ్య.. ఇతర మాతాలను ఎలా గౌరవిస్తారు.. హిందూ ధర్మాన్ని ఎలా ఆరాధిస్తారు అన్నది స్పష్టంగా కనిపించింది. గతంలో ఆయన ఓ పొలిటికల్ మీటింగ్ లో పాల్గొన్నప్పుడు.. అక్కడ నమాజ్ వినిపిస్తే.. ఒక్కసారి తన స్పీచ్ ఆపేశారు.. ఇలా చాలా సందర్భాల్లో ఇతర మతాలను బాలయ్య గౌరవిస్తూ వచ్చారు. తాజాగా టర్కీలో ఓ రెస్టారెంట్ లో ముస్లిం కుటుంబంతో కలిసి కూర్చున్న ఆయన వారితో జోక్ లు వేస్తూ మాట్లాడారు. అయితే తాను మందులు వేసుకోబేయే ముందు.. ఎదుటి వారిని ఒక నిమిషం సైలెంట్ గా ఉండమని చెప్పారు. ఆ తరువాత దేవుడిని మనసులో ప్రార్ధించి.. మందులు వేసుకున్నారు.

ఈ సందర్భంగా తన ఎదుటు కూర్చున్న ఫ్యామిలీతో మాట్లాడిన బాలయ్య జోక్ లు వేస్తూ నవ్వించారు. టీవీని దూరం నుంచి చూస్తే కళ్లకు చాలా మంచిదని.. అదే టీవీని పూర్తిగా చూడడం మానేస్తే.. మెదదుకు చాలా మంచిదంటూ జోక్ లు పేల్చారు. ఈ సందర్భంగా టీవీ సీరియల్స్ పైనా సైటర్లు వేశారు.. స్టార్ హీరో అని.. ఎమ్మెల్యే అనే హోదా లేకుండా ఓ కుటుంబంతో సరదాగా ఆయన గడిపిన తీరు.. ఫ్యాన్స్ ను మరోసారి ఫిదా అయ్యేలా చేసింది. ఈ సంభాషణను అక్కడ ఉన్న ఓ అభిమాని షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన అభిమానులు దటీజ్ బాలయ్య.. మా బాలయ్య తోపు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.