Balakrishna : జీవితం క్షణ భంగురం అన్న పెద్దల మాటను మళ్ళీ నిజం చేశాడు పునీత్ రాజ్ కుమార్. 46 ఏళ్ల వయస్సులో ఆయన అకాల మరణం ప్రతి ఒక్కరినీ శోకసంద్రంలోకి నెట్టింది. పునీత్ మరణంతో శాండల్ వుడ్ మాత్రమే కాదు.. యావత్ సినీ లోకం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. పునీత్ తో తమ బంధాన్ని అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పలువురు నటీనటులు విలపిస్తున్నారు. పునీత్ కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నారు.
పునీత్ అంత్యక్రియలు జరగనుండగా, ఆయన చివరి చూపు కోసం టాలీవుడ్ ప్రముఖులు కూడా బెంగళూరు వెళుతున్నారు. ఈ క్రమంలోనే కంఠీరవ స్టేడియానికి వెళ్లి పునీత్‌కు నివాళులర్పించారు బాలయ్య. పునీత్ పార్థివదేహాన్ని చూసి భావోద్వేగానికి గురైన ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. అనంతరం పునీత్ సోదరుడు శివరాజ్‌కుమార్‌ని పరామర్శించారు. బాలకృష్ణతోపాటు నరేశ్, శివబాలాజీ, ప్రభుదేవా సైతం నివాళులర్పించారు.
పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. 46 ఏళ్ల వయసులోనే ప్రాణాలు కోల్పోయిన ఆయన పార్థీవదేహాన్ని ఇంటికి తరలించారు. అక్కడి నుంచి అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం కంఠీరవ స్టేడియంకు తీసుకెళ్లారు. ప్రస్తుతం అక్కడ ఇసుక వేస్తే రాలనంత మంది జనాలు ఉన్నారు. పునీత్ భౌతిక కాయాన్ని చివరిసారిగా చూసి కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…