Ramya Krishna : 50 ఏళ్ల వయసులోనూ, యంగ్ హీరోయిన్లకు పోటీ ఇచ్చే అందంతో ఆకట్టుకుంటున్న అభినవ తార రమ్యకృష్ణ. హీరోయిన్‌గా ఓ ఊపు ఊపిన రమ్యకృష్ణ ఇప్పుడు సైడ్ క్యారెక్టర్స్ చేస్తోంది. నరసింహ సినిమాలో నీలాంబరిగా.. బాహుబలి సినిమాలో శివగామిగా నటించిన రమ్యకృష్ణ నటిగా తన సత్తా ఏంటో చూపించింది. 1992 నుంచి 2002 వరకు ఎన్నో భాషల్లో.. ఎన్నో సినిమాలు చేసింది.
టాప్ హీరోయిన్ గా మారి.. తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లోని పలువురు టాప్ హీరోలతో కలిసి నటించింది. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాక కూడా రమ్యకృష్ణ వరుస ఆఫర్స్‌తో దూసుకుపోతుంది. అయితే రమ్యకృష్ణ కెరీర్‌లో గొప్ప పాత్రగా నీలాంబరి పాత్రను చెబుతుంటారు. సినిమాలో హీరోయిన్ గా చేసిన సౌందర్య పాత్ర తనకు వచ్చి ఉంటే బాగుండేదని తను చాలా సార్లు అనుకుందట.
నరసింహ సినిమా విడుదల అయిన తొలి రోజు తన చెల్లి ఓ థియేటర్ కు వెళ్లింది. అక్కడ తెర మీద రమ్య కనిపించగానే జనాలు చెప్పులు విసిరారట. ఆ విషయం తనతో చెప్పినప్పుడు చాలా బాధ పడినట్లు వెల్లడించింది. ఆ తర్వాత తన పాత్రకు మంచి పేరు రావడం తనకు సంతోషం కలిగించినట్లు చెప్పింది. కాగా, ప్రస్తుతం తన భర్త దర్శకత్వంలో వస్తున్న రంగ మార్తండలో నటిస్తోంది. ఈ సినిమా నట సామ్రాట్ అనే ఓ మరాఠి సినిమాకు రీమేక్‌గా వస్తోంది.
రమ్యకృష్ణ సినిమాలతోపాటు వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తోంది. జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన క్వీ న్ వెబ్ సిరీస్‌లో ప్రధాన పాత్రలో రమ్యకృష్ణ నటించి.. అదరగొట్టింది. విజయ్ దేవరకొండ సినిమా లైగర్ లోనూ నటిస్తోంది. అటు బంగార్రాజు సినిమాలోనూ నాగార్జున సరసన నటిస్తోంది.