Ashu Reddy : బిగ్ బాస్ షో ద్వారా ఎంతో మంది కంటెస్టెంట్లు పాపులర్ అయ్యారు. వారు షోలో పాల్గొని బయటికి వచ్చిన అనంతరం సెలబ్రిటీలు అయిపోయారు. ఈ క్రమంలోనే కొందరికి సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. ఇక కొందరు టీవీ షోలు, ఈవెంట్లలో పాల్గొంటున్నారు. కొందరు సొంత యూట్యూబ్ చానల్స్ పెట్టి రెండు చేతులా సంపాదిస్తున్నారు. అలాంటి వారిలో అషు రెడ్డి ఒకరు.

బిగ్ బాస్ షోలో పాల్గొన్న అనంతరం అషు రెడ్డి లైఫ్ ఒక్కసారిగా టర్న్ అయిపోయింది. ఈమె గ్లామర్‌కు మారుపేరుగా నిలిచింది. ఆర్‌జీవీతో ఓ షో చేసిన అనంతరం అషు రెడ్డి ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. ఇక ఈమె ప్రముఖ యూట్యూబర్‌గా కూడా మారింది. ఈమెను జూనియర్ సమంత అని పిలుస్తుంటారు. కొన్ని యాంగిల్స్‌లో ఈమె అచ్చం సమంతలా ఉండడమే అందుకు కారణం. ఈ క్రమంలోనే అషు రెడ్డి పెట్టే పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.
Ashu Reddy : ఇదేం పని..
కాగా అషు రెడ్డి తాజాగా మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ అరియానా గ్లోరీతో కలిసి సరదాగా గడిపింది. ఓ దశలో అరియానా నడుముపై అషు రెడ్డి ముద్దు పెట్టింది. దీంతో ఒక్కసారిగా అరియానా షాక్ అయింది. అయితే ఏదైనా షోలో భాగంగా వారు ఇలా చేసి ఉండవచ్చని అనిపిస్తోంది. అయినప్పటికీ ఇలా అషు రెడ్డి ముద్దు పెట్టడంపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇదేం పని.. అని ప్రశ్నిస్తున్నారు.
ఈ మధ్య కాలంలో అషు రెడ్డి, అరియానాలు ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు. బహుశా వీరిద్దరూ కలిసి పాల్గొన్న ఏదైనా షోలో ఇలా చేసి ఉంటారని అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది.