Ashu Reddy : సెలబ్రిటీలు అన్నాక ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం అనేది షరా మూమూలే. అందుకుగాను వారు రకరకాల వ్యాయామాలు చేస్తూ డైట్‌ను పాటిస్తుంటారు. అలా ఫిట్‌గా ఉంటేనే అవకాశాలు ఎక్కువగా వస్తాయి. అందుకనే ఎల్లప్పుడూ యూత్‌ఫుల్‌గా కనిపించాలని వారు తాపత్రయ పడుతుంటారు. అయితే జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అషు రెడ్డి కూడా చూస్తుంటే ఫిట్ నెస్‌పై బాగానే శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది. ఆమె తాజా ఫొటోలు చూసి అభిమానులు షాకవుతున్నారు.
సమంతకు డూప్‌లా ఉండే అషు రెడ్డి సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె సమంతలా నటిస్తూ.. ఆమె పాటలకు డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది. వాటి తాలూకు వీడియోలు, ఫొటోలను అషు రెడ్డి షేర్ చేస్తుంటుంది. ఇక ఇటీవలే సమంత చేసిన పుష్ప ఐటమ్ సాంగ్ ను కూడా అషు రెడ్డి చేసి అలరించింది.
అయితే అషు రెడ్డి తాజాగా షేర్ చేసిన ఫొటోలను బట్టి చూస్తే ఆమె చాలా సన్నగా అయినట్లు అర్థమవుతుంది. అంతకు ముందు ఆమె ముద్దుగా, బొద్దుగా కనిపించేది. దీంతో ఆమెను కొందరు లావుగా ఉన్నావంటూ బాడీ షేమింగ్ కూడా చేసేవారు. అయితే ప్రస్తుతం ఆమె స్లిమ్‌గా, ట్రిమ్‌గా కనిపిస్తుండడం విశేషం.
తాజాగా అషు రెడ్డి షేర్ చేసిన ఫోటోలు అభిమానులకు షాక్‌కు గురి చేస్తున్నాయి. ఆమె ఇంతలా సన్నగా మారిపోయిందేమిటి ? అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి బరువు తగ్గిన ఈ అమ్మడికి అవకాశాలు ఇకనైనా వస్తాయా, లేదా.. అనేది.. వేచి చూస్తే తెలుస్తుంది.