Ashoka Vanamlo Arjuna Kalyanam : విశ్వక్ సేన్, రుక్సార్ ధిల్లన్‌లు హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ చిత్రం.. అశోకవనంలో అర్జున కళ్యాణం. ఈ సినిమా మే 6వ తేదీన విడుదల కానుంది. కాగా ఈ మూవీకి గాను మంగళవారం రాత్రి ఖమ్మంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో భాగంగా నటుడు విశ్వక్ సేన్ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. గత 3, 4 రోజులుగా నువ్వా నేనా అన్నట్లుగా యాంకర్ దేవి, విశ్వక్ సేన్ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం విదితమే. అందులో భాగంగానే విశ్వక్ సేన్‌కు నెటిజన్లు మద్దతు పలికారు. యాంకర్ దేవిదే తప్పంతా.. అని ఆయనకు సపోర్ట్‌ను ఇచ్చారు. అయితే దీనిపై విశ్వక్ సేన్ స్పందించారు.

తనకు సపోర్ట్‌ను ఇచ్చినందుకు ఫ్యాన్స్, నెటిజన్లు.. అందరికీ విశ్వక్ సేన్ థాంక్స్ చెప్పారు. మీరు సపోర్ట్ ఇవ్వబట్టే నేను ఇలా మీ ముందు ఉన్నా.. అదే ఇతరులు, బలహీనమైన వారు అయితే ఏమైపోయేవారే.. మీరే నా ఆస్తి, మీరే నాకు రక్షణ.. మీరు నాకు అందించిన సపోర్ట్‌ను మరిచిపోలేను. మీరు ఉండగా నన్ను ఎవరూ ఏమీ పీకలేరు. ఇంకా డౌట్ వస్తే హ్యాష్ ట్యాగ్ విశ్వక్‌సేన్ అని కొట్టి చూడమని చెబుతా.. అని విశ్వక్ సేన్ అన్నారు.
ఇక తన తల్లికి ఒకటే చెప్పానన్న విశ్వక్ సేన్.. తనను ఎవరు ఏమీ చేయలేరని అన్నారు. తనకు అమ్మాయిలు ఉంటే మర్యాద ఉందని.. తాను అమ్మాయిలకు మర్యాద ఇవ్వకపోతే ఆరోజు స్టూడియోకు ఎందుకు వస్తానని అన్నారు. ఈ విషయంలో తనకు అందరూ సపోర్ట్ ఇచ్చినందుకు విశ్వక్‌సేన్ మరోమారు నెటిజన్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఎమోషనల్ అయ్యారు.