Ashoka Vanamlo Arjuna Kalyanam : యంగ్ హీరో విశ్వక్ సేన్, రుక్సార్ ధిల్లాన్‌లు నటించిన లేటెస్ట్ మూవీ.. అశోక వనంలో అర్జున కల్యాణం. ఈ మూవీ తాజాగా విడుదల కాగా.. బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. దేవి నాగవల్లితో గొడవ కారణంగా ఈ మూవీకి బాగానే హైప్ వచ్చింది. దీంతోపాటు పబ్లిసిటీ కూడా బాగానే పెరిగింది. ఈ క్రమంలోనే ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. అయితే ఈ మూవీ త్వరలోనే ఓటీటీలో స్ట్రీమ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది.

అశోకవనంలో సినిమాకు విద్యాసాగర్ చింతా దర్శకత్వం వహించగా.. జయ్ క్రిష్ మ్యూజిక్ అందించారు. కాగా ఈ సినిమాకు గాను డిజిటల్ హక్కులను ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావడమే తరువాయి. ఈ క్రమంలోనే ఆహా యాప్‌లో ఈ మూవీ ఈ నెల 27వ తేదీన స్ట్రీమ్ కానున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాను ఎస్‌వీసీసీ డిజిటల్ తెరకెక్కించగా.. ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఈ మూవీ తెగ ఆకట్టుకుంటోంది. ఇటీవల నటుడు విశ్వక్‌సేన్‌కు, యాంకర్ దేవీ నాగవల్లికి జరిగిన గొడవ కారణంగా ఈ మూవీకి పబ్లిసిటీ బాగా వచ్చింది. దీంతోపాటు రేటింగ్స్ కూడా బాగానే వచ్చాయి. కనుకనే ఈ సినిమాను ఆదరిస్తున్నారు. ఇక విశ్వక్ తన ఖాతాలో ఈ మూవీతో మరో హిట్‌ను సాధించాడని చెప్పవచ్చు.