Asalem Jarigindi Review : కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్స్‌లో విడుదలవుతున్న చాలా చిత్రాలు మంచి వినోదం పంచడమే కాక బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబడుతున్నాయి. తాజాగా శ్రీరామ్, సంచితా పదుకునే జంటగా నటించిన ‘అసలేం జరిగింది’ కూడా ప్రేక్షకులకి పసందైన వినోదం పంచేందుకు థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉంది ? అంటే..
1970- 80లలో తెలంగాణలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. ఓ అదృశ్య శక్తితో హీరో ఏ విధంగా పోరాడాడు.. అన్న కథనే ఈ మూవీలో చూపించారు. పూర్తి వివరాలు తెలియాలంటే.. వెండి తెరపై ఈ మూవీని చూడాల్సిందే.
అసలేం జరిగింది ? చిత్రానికి ఎన్వీఆర్ దర్శకత్వం వహించగా, ఎక్స్‌డోస్ మీడియా పతాకంపై మైనేని నీలిమా చౌదరి, కింగ్ జాన్సన్ కొయ్యాడ నిర్మించారు. పూర్తి కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ హారర్ థ్రిల్లర్.. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. టైటిల్‌లోనే సస్పెన్స్‌తో నింపేశారు. ఈ క్రమంలోనే ఈ మూవీకి పాజిటివ్ టాక్ లభిస్తోంది.
తెలంగాణలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. సస్పెన్స్ థ్రిల్లర్ లవ్ స్టోరీగా ఈ మూవీ రన్ అవుతోంది. ‘అసలేం జరిగింది?’ మూవీని పూర్తిగా కొత్త కాన్సెప్టుతో, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రూపొందించారు. హార్రర్, థ్రిల్లర్ జోనర్‌లను ఇష్ట పడే ప్రేక్షకులకు ఈ మూవీ తప్పక నచ్చుతుంది.
విజయ్ ఏసుదాస్, విజయ్ ప్రకాష్, యాజిన్ నిజార్, మాళవిక, రాంకీ, భార్గవి పిళ్లై తదితర ప్రముఖ సింగర్లు పాడిన పాటలకు అమెజాన్ మ్యూజిక్, స్పాటిఫై, జియోసావన్, యాపిల్ మ్యూజిక్ వంటి మ్యూజిక్ ప్లాట్‌ఫారమ్స్ నుంచి చక్కటి రెస్సాన్స్ వస్తోంది. తొలుత ఈ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో రిలీజ్ చేయాలని భావించారు. కానీ ఫైనల్ గా థియేటర్స్ లో రిలీజ్ చేశారు.
ఈ సినిమాకు ఎస్.చిన్నా అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సీన్లకు అనుగుణంగా సంగీతం ఆకట్టుకుంటుంది. ఇక సేతు స్పెషల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకుల్ని ఆద్యంతం కట్టి పడేశాయి. హీరో శ్రీరాం ఈ సినిమాకు ప్రాణం పోశారు. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ యేలేంద్ర మహావీర్ స్వరకల్పన అద్భుతంగా ఉంది.
రాఘవ (ఎన్‌వీఆర్) ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారు. ఆద్యంతం ప్రతి సీన్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సాగుతుంది. మొత్తంగా చెప్పాలంటే.. హారర్, థ్రిల్లర్ మూవీలను ఇష్టపడేవారు కచ్చితంగా చూడాల్సిన సినిమా ఇదని చెప్పవచ్చు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…