Aryan Khan : బాలీవుడ్ డ్రగ్స్ కేస్ లో అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్ కు తన పేరేంట్స్ తో మాట్లాడే అవకాశం కల్పించారు. ముంబైలో ఆర్థర్ రోడ్ జైలు నుండి వీడియో కాల్ లో షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్ తో మాట్లాడారు. ఈ క్రమంలో కన్నీటి పర్యంతమైనట్లుగా తెలుస్తోంది. జైలులో ఉన్న ప్రతి వ్యక్తికి ఇంట్లో వాళ్ళకు ఫోన్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారు. అలాగే ఆర్యన్ కు వీడియో కాల్ అవకాశాన్ని కల్పించారు.
డ్రగ్స్ కేసులో ఆర్యన్ బెయిల్ పిటిషన్ పై రెండు రోజులుగా విచారణ జరిపిన సెషన్స్ కోర్ట్ తీర్పును రిజర్వ్ లో పెట్టింది. దీంతో ఆర్యన్ మరో 4 రోజుల పాటు ఆర్థర్ రోడ్ జైలులో ఉండాల్సిందే. ఆర్యన్ ఖాన్ లో జైలులో క్యాంటీన్ ఖర్చులకు రూ.4500 లను కుటుంబ సభ్యులు పంపారు. ఆర్యన్ ఖాన్ కు ఖైదీ నంబర్ N956 ను ఇచ్చారు. కరోనా పరీక్షల్లో ఆర్యన్ తో పాటు ఆర్భాజ్ కు నెగిటివ్ వచ్చిందని.. అతన్ని సాధారణ సెల్ కు తరలించారు. మరోవైపు పేరెంట్స్‌తో వీడియో కాల్ కూడా చేయించారట. ఆ సమయంలో ఆర్యన్ గుక్క పెట్టి ఏడ్చినట్టు తెలుస్తోంది.
అక్టోబర్ 2వ తేదీన ముంబై క్రూయిజ్ లో డ్రగ్స్ పార్టీలో జరిగిన రైడ్ లో ఆర్యన్ ఖాన్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని బెయిల్ పిటిషన్ పై వరుసగా హీట్ డిస్కషన్స్ జరిగాయి. ఆర్యన్ బెయిల్ పిటిషన్ ను మరోసారి వ్యతిరేకించారు. ఎన్సీబీ ఆరోపణలను ఆర్యన్ తరపు న్యాయవాదులు కొట్టిపారేశారు. సెలబ్రిటీస్ పిల్లలైతే తప్పు చేస్తే బెయిల్ ఇవ్వకూడదని అన్నారు. ఈ క్రమంలో ఇద్దరూ వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును ఈనెల 20వ తేదీ వరకు రిజర్వ్ లో పెట్టారు. మరి 20వ తేదీకైనా ఆర్యన్ ఖాన్ బెయిల్ విషయం ఓ కొలిక్కి వస్తుందో.. లేదో.. చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…