Balakrishna Jabardasth : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న కామెడీ షో జబర్ధస్త్. ఈ షోకి మొదట్లో నాగబాబు జడ్జిగా వ్యవహరించేవారు. రోజాతో కలిసి ఆయన చేసిన సందడి అంతా ఇంతా కాదు. నాగబాబు వెళ్లిన తర్వాత చాలా మంది గెస్ట్‌లు జడ్జిలుగా వచ్చారు. ఇప్పుడు మనో ఫిక్స్ అయిపోయాడు. అయితే రానున్న రోజులలో బాలకృష్ణ కూడా జబర్ధస్త్ జడ్జిగా ఉంటానని తాజాగా ఫోన్ కాల్ ద్వారా తెలిపారు.
తాజాగా జబర్దస్త్ కామెడీ షోకి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో విడుదల చేయగా.. ఇందులో రోజా – బాలకృష్ణలు ఫోన్‌లో మాట్లాడుకుని సందడి చేశారు. బాలకృష్ణకి ఫోన్ చేసిన రోజా.. తను రోజాని అని చెప్పగానే, హా రోజా గారు నమస్కారం అంటూ తన సంస్కారాన్ని చూపించారు. ‘బాగున్నారా?’.. అని రోజా అడగ్గా.. ‘బాగున్నానమ్మా.. మీరు ఎలా ఉన్నారు? అని యోగక్షేమాలు అడిగితెలుసుకున్నారు. ‘నేను బాగున్నా సార్.. నేను జబర్దస్త్ సెట్స్ నుంచి ఫోన్ చేస్తున్నా అని చెప్పారు.
‘మన అఖండ సినిమా షూటింగ్ జరుగుతోంది’ అని చెప్పిన బాలయ్యను మన ఇద్దరం కలిసి ఎప్పుడు యాక్ట్ చేద్దాం అని రోజా అడిగింది . భైరవద్వీపం పార్ట్ 2 లేదంటే బొబ్బిలి సింహం పార్ట్ 2 చేస్తారా ? అని అడుగుతున్నారు.. అని రోజా అడిగేసరికి బాలయ్య పెద్దగా నవ్వేశారు. తప్పకుండా చేద్దాం అందరూ ఎదురుచూస్తున్నారు.. మన కాంబినేషన్ కోసం.. కలసి సినిమా చేయడమే కాదు.. జబర్దస్త్ షోకి జడ్జిగా కూడా వస్తాను.. మీ అందర్నీ కలుస్తాను అని మాట ఇచ్చారు బాలయ్య. అనంతరం ఆది, రాఘవ వీళ్లంతా ఎలా ఉన్నారు అని అడిగారు. మొత్తానికి బాలయ్య ఫోన్ కాల్ జబర్ధస్త్ అభిమానులలో జోష్ పెంచిందనే చెప్పవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…