Apple Watch : ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ ఇటీవలే వాచ్ సిరీస్‌లో భాగంగా యాపిల్ వాచ్ 7 సిరీస్ వాచ్‌లను లాంచ్ చేసిన విషయం విదితమే. అయితే ఈ వాచ్‌లను భారత్‌లోని వినియోగదారులు ప్రస్తుతం ప్రీ ఆర్డర్ చేయవచ్చు. ఈ వాచ్‌లలో జీపీఎస్, జీపీఎస్ ప్లస్ సెల్యులార్ ఆప్షన్లు లభిస్తున్నాయి. ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా కస్టమర్లు ఈ వాచ్‌ను వాడవచ్చు.
యాపిల్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌తోపాటు అమెజాన్, ఇతర ఆఫ్‌లైన్ స్టోర్‌లలో ఈ వాచ్‌ను ప్రీ ఆర్డర్ చేయవచ్చు. అయితే అక్టోబర్ 15వ తేదీ నుంచి ఈ వాచ్‌లను బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తారు.
యాపిల్ వాచ్ సిరీస్ 7 వాచ్‌ల ధరలు ఇలా ఉన్నాయి.
* యాపిల్ వాచ్ సిరీస్ 7 అల్యూమినిమయం కేస్ 40ఎంఎం జీపీఎస్ విత్ స్పోర్ట్ బ్యాండ్ ధర రూ.41,900
* యాపిల్ వాచ్ సిరీస్ 7 అల్యూమినియం కేస్ 45ఎంఎం జీపీఎస్ విత్ స్పోర్ట్ బ్యాండ్ ధర రూ.44,900
* యాపిల్ వాచ్ సిరీస్ 7 అల్యూమినియం కేస్ 40ఎంఎం జీపీఎస్ + సెల్యులార్ విత్ స్పోర్ట్ బ్యాండ్ ధర రూ.50,900
* యాపిల్ వాచ్ సిరీస్ 7 అల్యూమినియం కేస్ 45ఎంఎం జీపీఎస్ + సెల్యులార్ విత్ స్పోర్ట్ బ్యాండ్ ధర రూ.53,900
* యాపిల్ వాచ్ సిరీస్ 7 స్టెయిన్‌లెస్ స్టీల్ కేస్ 40ఎంఎం జీపీఎస్ + సెల్యులార్ విత్ స్పోర్ట్ బ్యాండ్ ధర రూ.69,900
* యాపిల్ వాచ్ సిరీస్ 7 స్టెయిన్‌లెస్ స్టీల్ కేస్ 45ఎంఎం జీపీఎస్ + సెల్యులార్ విత్ స్పోర్ట్ బ్యాండ్ ధర రూ.73,900
* యాపిల్ వాచ్ సిరీస్ 7 స్టెయిన్‌లెస్ స్టీల్ కేస్ 40ఎంఎం జీపీఎస్ + సెల్యులార్ విత్ మిలానీస్ లూప్ ధర రూ.73,900
* యాపిల్ వాచ్ సిరీస్ 7 స్టెయిన్‌లెస్ స్టీల్ కేస్ 45ఎంఎం జీపీఎస్ + సెల్యులార్ విత్ మిలానీస్ లూప్ ధర రూ.77,900
* యాపిల్ వాచ్ సిరీస్ 7 టైటానియం కేస్ 40ఎంఎం జీపీఎస్ + సెల్యులార్ విత్ స్పోర్ట్ బ్యాండ్ ధర రూ.83,900
* యాపిల్ వాచ్ సిరీస్ 7 టైటానియం కేస్ 45ఎంఎం జీపీఎస్ + సెల్యులార్ విత్ స్పోర్ట్ బ్యాండ్ ధర రూ.87,900