Anushka Shetty : తెలుగు ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరు అనుష్క శెట్టి. సూపర్ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన అందాల ముద్దుగుమ్మ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. అనతి కాలంలోనే దక్షిణాదిలో టాప్ హీరోయిన్ హోదా పొందిన అనుష్క నిశ్శబ్ధం సినిమా తర్వాత మరో సినిమా చేయలేదు. ఇటీవల ఆమె బర్త్ డే సందర్భంగా ఒక ప్రకటన విడుదలవ్వగా.. ఈ సినిమాలో హీరోగా నవీన్ పొలిశెట్టి చేస్తున్నాడని తెలియజేసింది టీమ్. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించనుంది.
యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమాకు పి.మహేష్ బాబు దర్శకత్వం వహించనున్నారు. అనుష్క ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఈ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాకు మిస్ శెట్టి.. మిస్టర్.. పోలిశెట్టి.. అనే టైటిల్ నిర్ణయించారని అంటున్నారు. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. అయితే అనుష్క సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్‌గా ఉండదనే సంగతి మనందరికీ తెలిసిందే. అప్పుడప్పుడూ ఆసక్తికర పోస్ట్‌లు పెడుతుంటుంది. తాజాగా తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ విషెస్ తెలిపింది.
తన తండ్రితో సరదాగా దిగిన ఫొటోలను కలిపి ఒక ఫొటోగా మార్చి షేర్ చేసిన అనుష్క.. సంవత్సరాలు గడుస్తూనే ఉంటాయి. నాకు ఎంత వయసొచ్చినా.. నేనెప్పటికీ మీ క్యూట్ చిన్నపిల్లనే. హ్యాపీ బర్త్ డే పాపా.. అంటూ తన తండ్రికి క్యూట్‌గా విషెస్ తెలిపింది అనుష్క. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనుష్క కేవలం కమర్షియల్ సినిమాలతోనే కాదు.. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో కూడా పాపులారిటీ సంపాదించుకుంది. ఇప్పటికీ అనుష్కను హీరోయిన్‌గా పెట్టి భారీ బడ్జెట్ లేడీ ఓరియెంటెడ్ సినిమాలను తెరకెక్కించాలని ఎంతో మంది దర్శకులు ఎదురుచూస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…