Hansika : అందుక‌నే హిందీ సినిమాల‌ను చేయ‌డం లేదు.. తేల్చి చెప్పేసిన హ‌న్సిక‌..!

Hansika : బ‌బ్లీ గార్ల్ హన్సిక గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచయం చేయ‌న‌క్క‌ర్లేదు. దేశముదురుతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన హన్సిక మోత్వానీ 2019 నుంచి సినిమాలకు కొంచెం గ్యాప్ ఇచ్చింది. ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమాల్లో నటిస్తూ బిజీ అయ్యిందీ మస్కా బ్యూటీ. ఇప్పుడు ఆమె చేతిలో తొమ్మిది సినిమాలు ఉన్న‌ట్టు తెలుస్తోంది. అందంతోపాటు అభినయం కూడా ఉన్న నటి కావడంతో ఆమెకు అవ‌కాశాలు వెతుక్కుంటూ వ‌స్తున్నాయి. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా సక్సెస్ సాధించిన సినిమాలు కూడా ఉన్నాయి.

Hansika

మహా, మై నేమ్ ఈజ్ శృతి, రౌడీ బేబీ, పార్ట్‌నర్ సినిమాలతోపాటు ఒక ఓటీటీ ప్రాజెక్టు చేతిలో ఉందని తెలుస్తోంది. ఇవి కాకుండా మరో మూడు సినిమాలున్నాయి. అందుకే 2022 కొత్త ఏడాది తనకెంతో ప్రత్యేకమంటోంది హన్సిక. టాలీవుడ్ లో కెరీర్ స్టార్ట్ చేసిన హన్సిక‌కు ఇక్కడ పెద్దగా కలిసి రాలేదు. తమిళంలో మాత్రం ఆమెను ఆరాధ్య దేవ‌త‌గా కొలుస్తున్నారు. సౌత్‌లో ర‌చ్చ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ అంద‌రి మాదిరిగా బాలీవుడ్ వైపు దృష్టి పెట్టలేదు.

ఆడియన్స్ కు ఆరాధ్య దేవతగా మారిపోయింది హాన్సిక. ఎటు చూసుకున్నా సౌత్ లోనే అటూ.. ఇటూ.. తిరిగింది కానీ.. బాలీవుడ్ లో మాత్రం పాగా వేయలేక పోయింది. హృతిక్ రోషన్ హీరోగా నటించిన కోయి మిల్ గయా సినిమాలో బాల న‌టిగా న‌టించింది హ‌న్సిక‌. అయితే ఆ తరువాత హీరోయిన్ గా మాత్రం బాలీవుడ్ లో రాణించలేకపోయింది. 2008లో వ‌చ్చిన మ‌నీ హై తో హ‌నీ హై హిందీ సినిమాలో మెరిసిన హ‌న్సిక‌ మ‌ళ్లీ ఆ త‌ర్వాత వైపు క‌న్నెత్తి కూడా చూడ‌లేదు. దానికి కార‌ణం చెప్పుకొచ్చింది. అన్ని ర‌కాల సినిమాలు చేయ‌డాన్ని నేను ఎంజాయ్ చేస్తా. కానీ నాకు ఆఫ‌ర్లు మాత్రం ఎక్కువ సౌత్ ఇండ‌స్ట్రీ నుంచే వ‌స్తున్నాయి. ద‌క్షిణాదిన క‌థ‌ల‌తోపాటు కంటెంట్ ఎక్కువ‌గా ఉంటుంద‌ని నేను నమ్ముతాను అంటుంది హ‌న్సిక‌. మ‌రి రానున్న రోజుల‌లో హన్సిక‌కి బాలీవుడ్‌ ఆఫ‌ర్స్ వ‌స్తే ఓకే చేస్తుందా.. లేదా.. అనేది చూడాలి.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM