Anu Emmanuel : మజ్ను అనే చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన బ్యూటీ.. అను ఇమ్మాన్యుయెల్. ఈమె కెరీర్ మళయాళం ఇండస్ట్రీతో మొదలైంది. ఆ తరువాత తెలుగులో ఈమెకు వరుసగా ఆఫర్లు వచ్చాయి. కానీ ఈమె అదృష్టం అంత బాగా ఏమీ లేదనే చెప్పాలి. యాక్ట్ చేసిన ఒకటి రెండు సినిమాలు తప్ప పెద్దగా ఈమెకు హిట్స్ లేవు. మజ్ను తరువాత కిట్టు ఉన్నాడు జాగ్రత్త, ఆక్సిజన్, అజ్ఞాతవాసి, నా పేరు సూర్య వంటి చిత్రాల్లో నటించింది. కానీ ఇవేవీ హిట్‌ను అందించలేదు. అయినప్పటికీ ఈమెకు ఆఫర్లు మాత్రం తగ్గలేదు.
ఇక గీత గోవిందంలో క్యారెక్టర్ చేసింది. కానీ ఇందులో ఆమెది ప్రధాన పాత్ర కాదు. అలాగే శైలజా రెడ్డి అల్లుడు, అల్లుడు అదుర్స్, మహా సముద్రం వంటి చిత్రాల్లోనూ ఈమె నటించింది. కానీ అవి కూడా నిరాశపరిచాయి. దీంతో ఈమె సినిమా ఇండస్ట్రీకి దాదాపుగా దూరం అయినట్లే కనిపిస్తోంది. అయితే ఈమె గత కొంత కాలంగా అల్లు అరవింద్ రెండో కుమారుడు అల్లు శిరీష్‌ను ప్రేమిస్తుందని వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ కలసి దిగిన ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. దీంతో వీరు పెళ్లి చేసుకోబోతున్నారని కూడా అంటున్నారు.

అను ఇమ్మాన్యుయెల్, అల్లు శిరీష్‌లు కలసి ఓ చిత్రంలోనూ నటిస్తున్నారు. ప్రేమ కాదంటలో వీరు యాక్ట్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ ఫస్ట్ లుక్ వచ్చి చాలా రోజులే అవుతోంది. అయినప్పటికీ ఈ మూవీ గురించి తరువాతి అప్‌డేట్ ఏమిటో చెప్పలేదు. దీంతో అసలు ఈ మూవీ షూటింగ్ కొనసాగుతుందా.. రిలీజ్ అవుతుందా.. అన్న అనుమానాలు వస్తున్నాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో మాత్రం వీరు ప్రేమాయణం కొనసాగిస్తున్నారని వార్తుల వస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంత ఉంది.. అన్నది తెలియాల్సి ఉంది.