Anu Emmanuel : అందాల ముద్దుగుమ్మ అను ఇమ్మాన్యుయేల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తెలుగులో నటించిన తొలి చిత్రంతోనే హిట్ అందుకున్న నటి అను ఇమ్మాన్యుయేల్. మజ్ను చిత్రంలో నానికి జోడీగా నటించిన ఈ అమ్మడు అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ టాప్ హీరోలందరి సరసన నటించింది. ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో రొమాన్స్ చేసే అవకాశం దక్కించుకుంది ఈ బ్యూటీ. ఎన్నో ఆశలు పెట్టుకున్న అజ్ఞాతవాసి చిత్రం భారీ అంచనాలతో విడుదలై తీవ్రంగా నిరాశపరిచింది. ఇప్పటికీ అను ఇమ్మాన్యుయేల్ మంచి అవకాశాలే అందుకుంటోంది.

అందం, అభినయం ఉన్నా కూడా అదృష్టం కలసి రావడం లేదు. ప్రస్తుతం అను.. అల్లు శిరీష్ కి జోడిగా ప్రేమ కాదంట అనే చిత్రంలో నటిస్తోంది. భారీ అంచనాలతో విడుదలైన మహాసముద్రం చిత్రం బాక్సాఫీస్ వద్ద ఢమాల్ అంది. దీంతో ప్రేమ కాదంట సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. తాజాగా అను ఇమ్మాన్యుయేల్ ఓ రెస్టారెంట్ లో మెరిసింది. పొట్టి బట్టలలో ఆమె అందాలను ఆరబోస్తూ పిచ్చెక్కిస్తోంది. వైట్ షర్ట్, బ్రౌన్ టాప్, జీన్స్ షార్ట్ లో మెరిసింది. ఈ అమ్మడిని ఇలా చూసి కుర్రకారు మైమరచిపోతున్నారు.
అజ్ఞాతవాసి చిత్రం భారీ ఫ్లాప్ కాగా.. బన్నీ సరసన నటించిన నా పేరు సూర్య చిత్రం కూడా విజయం సాధించలేదు. దీంతో రెండు భారీ చిత్రాల్లో ఆమెని దురదృష్టమే వెంటాడింది. ఈ రెండు చిత్రాలు విజయం సాధించి ఉంటే ప్రస్తుతం అను క్రేజ్ వేరుగా ఉండేది. ఇప్పుడు పెద్దగా సినిమా అవకాశాలు లేకపోవడంతో అను ఇమ్మాన్యుయేల్ అందాలు ఆరబోస్తూ నిర్మాతలకు గాలం విసురుతోంది. మరి ఈ అమ్మడి అందచందాలకు రానున్న రోజులలో ఆఫర్స్ వస్తాయా.. అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.