Andrew Symonds : ఆస్ట్రేలియాకు చెందిన అత్యంత విధ్వంసకరమైన బ్యాట్స్‌మెన్ లలో ఆండ్రూ సైమండ్స్ (46) ఒకరు. అప్పట్లో రికీ పాంటింగ్ సారథ్యంలోని ఆస్ట్రేలియా జట్టు ఎంతో దుర్బేధ్యంగా ఉండేది. ఆ జట్టులో సైమండ్స్ ఒకరు. ఈయన బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్‌లోనూ రాణించారు. అప్పట్లో ఐపీఎల్ ప్రారంభంలో ఉన్న డెక్కన్ చార్జర్స్ జట్టుకు సైమండ్స్ ఆడాడు. ఆ తరువాత కొంత కాలానికి అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. ప్రస్తుతం కామెంటేటర్ గా వ్యవహరిస్తున్న సైమండ్స్ శనివారం హఠాన్మరణం చెందాడు. శనివారం రాత్రి ఆస్ట్రేలియాలోని టౌన్స్ విల్లె సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో సైమండ్స్ దుర్మరణం పాలయ్యాడు. దీంతో క్రికెట్ లోకం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది.
సైమండ్స్ మృతితో యావత్ క్రికెట్ ప్రపంచం ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఈ క్రమంలోనే ప్రస్తుత క్రికెటర్లతోపాటు పలువురు మాజీలు కూడా ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. అయితే ఇటీవలే ఆస్ట్రేలియాకు చెందిన మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ గుండె పోటుతో చనిపోగా.. ఇప్పుడు సైమండ్స్ చనిపోవడం ఆ జట్టును ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది. సైమండ్స్‌తో తమకు ఉన్న అనుబంధాన్ని తోటి మాజీ జట్టు సభ్యులు గుర్తు చేసుకుని విచారానికి గురవుతున్నారు. ఇక సైమండ్స్‌కు ఐసీసీ సైతం నివాళులు అర్పించింది. అప్పట్లో 2003 ప్రపంచకప్‌లో సైమండ్స్ బ్యాటింగ్ కు చెందిన వీడియోను ఐసీసీ షేర్ చేసి నివాళులు అర్పించింది.

2003 ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియాకు రికీ పాంటింగ్ కెప్టెన్ గా ఉన్నాడు. ఆ టోర్నీ సౌతాఫ్రికాలో జరిగింది. అందులో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లోనే సైమండ్స్ విధ్వంసకరంగా ఆడాడు. 125 బంతుల్లో 2 సిక్సర్లు, 18 ఫోర్లతో 143 పరుగులు చేసి సైమండ్స్ నాటౌట్ గా నిలిచాడు.దీంతో ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 8 వికెట్లకు 310 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన పాక్ 44.3 ఓవర్లలనే ఆలౌట్ అయింది. ఆ మ్యాచ్‌లో ఆసీస్ 82 పరుగుల తేడాతో పాక్‌పై ఘన విజయం సాధించింది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ తాలూకు వీడియోను ఐసీసీ షేర్ చేసి సైమండ్స్ కు నివాళులు అర్పించింది.
As we mourn the loss of former Australian all-rounder Andrew Symonds, we take a look back to his tremendous 143* against Pakistan at the 2003 World Cup.#RIPRoy pic.twitter.com/oyoH7idzkb
— ICC (@ICC) May 15, 2022
ఇక సైమండ్స్ మంకీ గేట్ వివాదంతోనూ పాపులర్ అయ్యాడు. అప్పట్లో ఆస్ట్రేలియాలో భారత జట్టు పర్యటించగా.. భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌ను సైమండ్స్ మంకీగా దూషించాడు. దీంతో యావత్ ప్రపంచం భజ్జీకి అండగా నిలిచింది. అయితే ఆ తరువాత కొంత కాలానికి అలా పిలిచినందుకు సైమండ్స్ సారీ కూడా చెప్పాడు. కాగా సైమండ్స్ హఠాన్మరణం తోటి ప్లేయర్లందరినీ ఎంతో షాక్‌కు గురి చేస్తోంది.