ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీకి రాష్ట్రంలో ఎదురు లేకుండా పోయింది. అసెంబ్లీ ఎన్నికల్లోనే అత్యధిక స్థానాలను ప్రజలు వైకాపాకు కట్టబెట్టారు. దీంతో జగన్ సీఎం అయ్యారు. అంతేకాదు, ఆయన పాదయాత్రలో, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను కూడా పూర్తి చేస్తున్నారు. దీంతో ఏ ఎన్నికల్లో అయినా సరే వైకాపా విజయ దుందుభి మోగిస్తూనే వస్తోంది. ఇక ఇటీవల తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగిన విషయం విదితమే. కాగా ఆ ఎన్నికకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. ఈ క్రమంలో వైసీపీ తన సీటును మళ్లీ సొంతం చేసుకుంటుందని అన్ని ఎగ్జిట్స్ పోల్స్ తేల్చి చెప్పాయి.
తిరుపతి లోక్‌సభ సిట్టింగ్ స్థానాన్ని వైకాపా మళ్లీ సొంతం చేసుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. ఈ క్రమంలోనే ఆరా ఎగ్జిట్ పోల్స్‌లో వైకాపాకు 65.85 శాతం, టీడీపీకి 23.10 శాతం, బీజేపీకి 7.34 శాతం ఓట్లు వస్తాయని తెలిపారు. అయితే తుది ఫలితాలకు 2 నుంచి 3 శాతం వరకు తేడా ఉండేందుకు అవకాశం ఉందని వెల్లడించారు.
ఇక ఆత్మ సాక్షి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కూడా వైకాపాకే సీటు వస్తుందని వెల్లడైంది. ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం వైకాపాకు 59.25 శాతం, టీడీపీకి 31.25 శాతం, బీజేపీకి 7.5 శాతం వరకు ఓట్లు రావచ్చని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను బట్టి చూస్తే వైసీపీ అభ్యర్థి గురుమూర్తి తిరుపతి ఎంపీగా విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఉప ఎన్నిక ఫలితాలు మే 2వ తేదీన వెలువడుతాయి కనుక అప్పటి వరకు వేచి చూడాల్సిందే.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…