అప్పులు బాధలు తట్టుకోలేక కుటుంబ పోషణ భారమై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. ఈ క్రమంలోనే తన చావుకు ఎవరూ బాధ్యులు కారని ముందుగానే పోలీస్ కమిషనర్ గారికి లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్న ఘటన కృష్ణా జిల్లా పెనమలూరులో చోటు చేసుకుంది. ఈ విధంగా వ్యక్తి రాసిన లెటర్ ఆధారంగా పోలీసులు తెలిపిన వివరాల మేరకు.
పటమటలంకకి చెందిన యు.సాయిబాబు అనే వ్యక్తి అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు, తన చావుకు ఎవరూ బాధ్యులు కారని, తనకు పెళ్లిడ్డొచ్చిన ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని, వీలైతే వారికి తగిన సహాయం చేయమని విజయవాడ పోలీస్ కమిషనర్ గారికి లేఖ రాసి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అదే విధంగా అతని చివరి కోరికను కూడా లెటర్ లో తెలుపుతూ ఆత్మహత్య చేసుకున్నాడు.
తాను మరణించిన తర్వాత తన శవాన్ని తన బంధువులకు, తన భార్య బిడ్డలకు అప్పగించకూడదని, తన శవాన్ని ఒక అనాధ శవంలా భావించి దహన సంస్కారాలు నిర్వహించాలని, అప్పుడే తన చావుకు ఒక అర్థం ఉంటుంది అని ఈ లేఖలో పేర్కొన్నారు. ఈ విధంగా తన చివరి కోరికను నెరవేర్చమని విజయవాడ పోలీస్ డిపార్ట్మెంట్ కు మొత్తం పాదాభివందనం చేస్తున్నట్లు తెలుపుతూ రాసిన లేఖ తన కుటుంబ సభ్యులకు కంటతడి పెట్టిస్తోంది. ఈ విధంగా లేఖ రాసిన సాయిబాబా ఆదివారం ఉదయం పెదపులిపాక వద్ద కరకట్టపై చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అతని దగ్గర ఈ లెటర్ ను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇది అతను రాశాడా? లేక మరెవరైనా రాసి విధంగా హత్య చేశారా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.