వారసత్వంగా వచ్చిన ఇంటిని కాపాడుకోవడం కోసం ఎనిమిది పదుల వయసులో ఉన్న ఓ వృద్ధురాలు తనకు న్యాయం కావాలంటూ కోర్టు మెట్లెక్కింది.తన తండ్రి నుంచి వారసత్వంగా వస్తున్న ఇంటిని కాపాడుకోవడం కోసం న్యాయపోరాటం చేస్తోంది.ఈ క్రమంలోనే తన తరఫున కేసు వాదించడానికి లాయర్ కు డబ్బు చెల్లించడం కోసం వృద్ధురాలు రోడ్డెక్కి భిక్షాటన చేస్తున్న ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
కడపకు చెందిన భూరుగుల రాజమ్మకు తన తల్లిదండ్రుల నుంచి ఆస్తిగా వచ్చిన తన ఇంటిని కాపాడుకుంటూ ఉంది.అయితే గత కొద్ది సంవత్సరాల క్రితం రాజమ్మ భర్త చనిపోవడంతో కొంత డబ్బు అవసరమైతే ఆ ఇంటిని సాంబయ్య అనే వ్యక్తి దగ్గర తాకట్టు పెట్టి కొంత డబ్బులు తీసుకుంది. మూడు సంవత్సరాలలోగా తను తీసుకున్న డబ్బులు చెల్లిస్తానని అగ్రిమెంట్ రాయించుకున్నారు. అయితే సదరు వ్యక్తి డబ్బు చెల్లించిన ఏడాదిలోగా తిరిగి వచ్చి డబ్బులు చెల్లించాలని లేకపోతే ఇంటిని సొంతం చేసుకుంటానని బెదిరించాడు.
రాజమ్మ పెద్దగా చదువుకోకపోవడంతో ఇంటిని తన పేరుపై మార్చుకోవడమే కాకుండా ప్రస్తుతం ఆ ఇల్లు తన పేరుపై ఉందని కోర్టుకి వెళ్ళాడు. ఈ క్రమంలోనే రాజమ్మ కోర్టుకు వెళ్లి తన ఇంటిని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది.అయితే తన కేసును వాదించడానికి లాయర్ కి చెల్లించాల్సిన ఫీజు కూడా తనవద్ద లేదని అందుకోసమే భిక్షాటన చేస్తున్నానని రాజమ్మ రోడ్డెక్కి భిక్షాటనకు దిగారు. ఈ క్రమంలోనే దాతలు ఎవరైనా తనకు సహాయం చేసి తనఇంటిని తనకు దక్కేలా చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…